Krishna: ఆ లెజెండ్రీ డైరెక్టర్ నాకు హిట్ ఇవ్వలేకపోయాడు కానీ ఆ రూపంలో రుణం తీర్చుకున్నాడు.. సూపర్ స్టార్ కృష్ణ!

Krishna:  తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ స్టార్ కృష్ణ గురించి అతని నటన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జేమ్స్ బాండ్ సినిమాతో అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ. ఆ తర్వాత వచ్చిన తేనె మనసులు, గూడచారి 116 సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆపై పలు సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.

స్టార్ డం గా కృష్ణ గారు గుర్తింపు తెచ్చుకున్న సమయంలో అతడు భారీ స్థాయిలో వరుస విజయాలు అందుకున్నాడు. అంతేకాకుండా పలు సినిమాలు కృష్ణ గారికి ఇండస్ట్రీ హిట్ ను కూడా తెచ్చిపెట్టాయి. ఇలా కృష్ణ గారు టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. ఇతడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు కృష్ణ.

మరి ఇటువంటి కృష్ణ గారికి అప్పటి స్టార్ డైరెక్టర్ ఒక హిట్ ఇవ్వలేకపోయాడట. కానీ ఆ రుణాన్ని మరో రూపంలో తీర్చుకున్నాడట ఆ డైరెక్టర్. కృష్ణ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సూపర్ సార్ కృష్ణ, దాసరి కృష్ణ కాంబినేషన్లో శుభమస్తు అనే సినిమా విడుదలైంది. అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది.

కానీ అదే దాసరి దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ సినిమాలో విజయశాంతి కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాలో కృష్ణ ఒక గెస్ట్ రోల్ ను చేశాడు. కాగా ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో విజయం అందుకుంది. అలా కృష్ణ హీరోగా నటించిన సినిమా ప్లాప్ అయిన గెస్ట్ రోల్ చేసిన ఒసేయ్ రాములమ్మ సినిమా మాత్రం భారీ స్థాయిలో హిట్ అయింది. కాబట్టి దాసరి నాకు ఆ రూపంలో హిట్ ఇచ్చాడని కృష్ణ గారు ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -