Viveka Murder Case: జగన్ ను వివేకా హత్య కేసు ముంచేయనుందా.. కడప ఫలితమే అందుకు సాక్ష్యం కానుందా?

Viveka Murder Case: ఏపీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు. ఎన్నికలకు కనీసం 50 రోజుల సమయం పడుతుంది. కానీ, రేపే ఎన్నికలు అన్నంతగా వాతావరణం మారింది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎవరికి గెలుపు అనే విషయంలో ప్రజలు, ఓటర్లు, రాజకీయ నాయకులకు ఓ క్లారిటీ వచ్చింది. ఆయా పార్టీలు చెప్పుకుంటున్న మెజార్టీలో మార్పు ఉండొచ్చేమో కానీ.. ఫలితాల్లో ఎలాంటి తేడా ఉందడని అంతా భావిస్తున్నారు. రోజు రోజుకి ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. రోజుకో అస్త్రాన్ని విపక్ష కూటమి తన అమ్ముల పొదిలో వేసుకుంటుంది. ఇక.. అధికార పార్టీ ఒక్కో అవకాశాన్ని చేజార్చుకుంటుంది. కీలకనేతలు పార్టీని వీడుతున్నారు. వైసీపీ అభ్యర్థుల జాబితా కంటే.. పార్టీని వీడుతున్నవారి జాబితాయే ఎక్కువగా ఉంటుంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు దాదాపు ఖాయం అయ్యాయి. ఏదో అద్భుతం జరిగితే తప్పా.. వైసీపీ ఓటమి నుంచి తప్పించుకోదనే చర్చ జోరుగా జరుగుతోంది.

అందుకే ఏపీలో ఎన్నికల ఫలితాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఈ లోపు జరిగే రాజకీయ పరిణామాలనే నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కడప, పులివెందులపైనే పడింది. జగన్ పార్టీని గెలిపిస్తారా? లేదా? అన్నది కాదు.. ఆయన పులివెందులలో గెలుస్తారా? కడప ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంటారా? అనే దానిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పులివెందుల నుంచి జగన్‌పై పోటీ చేస్తానని సవాల్ విరిసిరారు. ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు వ్యతిరేకంగా సాక్ష్యంగా చెప్పాలని జగన్ మనుషులు తనను ప్రలోభాలకు గురిచేశారని అన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారడం వలనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి నాలుగు నెలలు కడప జైల్లో వేశారని ఆరోపించారు. తన ప్రాణాలకు హాని ఉందని తెలంగాణ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయనపై పులివెందులలో సింపతీ ఉంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని అంటున్నారు. అదే జరిగితే జగన్ కు ఎదురీత తప్పదు. ఎందుకంటే వివేకాహత్య కేసులో సీబీఐ సంచలన అంశాలు బయటపెట్టింది. కడప ఎంపీ సీటు విషయంలో జరిగిన వివాదం వలనే వివేకానందరెడ్డి హత్యకు గురైయ్యారని సీబీఐ తెలిపింది. గత ఎన్నికల్లో చంద్రబాబే తన బాబాయ్ ని చంపించారని ప్రచారం చేసి సిపంతీని జగన్ సంపాధించారు. ఈ కేసులో దర్యాప్తు జరిగిన కొద్ది కీలక అంశాలు బయటకు వచ్చి జగన్ మెడకు చుట్టుకుంది. దీంతో.. పులివెందులలో కూడా జగన్ కు గతంలో వచ్చినన్ని ఓట్లు రావు. పైగా పులివెందులలో జగన్ సొంత కుటుంబ సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి వారు సహకరిస్తారు. కానీ, ఈ ఎన్నికల్లో వారంతా జగన్ కు వ్యతిరేకం అయ్యారు. కాబట్టి దస్తగిరి గట్టిపని చేస్తే జగన్ కు ఇబ్బందులు తప్పవు.

దస్తగిరి సంగతి అటుంచితే కడప ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ సునీత రెడీ అవుతున్నారు. తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయస్థానాల్లో న్యాయం జరగలేదని.. ప్రజాకోర్టులోనే న్యాయం జరగాలని సునీత భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. వివేకానందరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన అనుచరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పోటీ కడప ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా? కాంగ్రెస్ తరుఫున పోటీ చేయాలా? అనే సందిగ్థంలో ఉన్నారు. ఇండిపెండెంట్‌గా అయితే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా సహకరిస్తాయని ఇప్పుటికే ఆమెకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే అవినాష్ రెడ్డి ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అందుకే.. జగన్ పార్టీని గెలిపించుకోవడం కంటే.. పులివెందుల, కడపను గెలిపించుకోవడమే కష్టంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -