Dastagiri: ఆ పార్టీ నుంచి పోటీ చేయనున్న దస్తగిరి.. పులివెందుల టికెట్ హామీ లభించడంతో?

Dastagiri: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వారిలో దస్తగిరి ఒకరు అయితే ఈయన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి అప్రూవల్ గా మారి బయట తిరుగుతున్నారు. ఇలా వివేక హత్య కేసులో నిందితుడిగా ఈయన పేరు మారుమోగింది అయితే తాజాగా దస్తగిరి వచ్చే ఎన్నికలలో తాను కూడా పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇలా దస్తగిరి ఎన్నికల బరిలో దిగబోతున్నానని తెలియజేయడంతో ఈయన ఏ పార్టీ తరపున పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక దస్తగిరి తాజాగా జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. ఈ పార్టీని న్యాయ‌వాది జ‌డ శ్రావ‌ణ్‌కుమార్ న‌డిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ అభ్య‌ర్థుల కోసం వెతుకుతున్న క్ర‌మంలో ద‌స్త‌గిరి గురువారం సాయంత్రం పార్టీలో చేరారు.

ఈ విధంగా దస్తగిరి పార్టీలో చేరేటమే ఆలస్యం వెంటనే ఆయనకు పార్టీలో సభ్యత్వం కూడా కల్పించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ ప్రధాన పార్టీకి అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో సుమారు 100 స్థానాలలో తమ పార్టీ పోటీ చేయబోతున్నారు అంటూ జడ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. ఇలా వైయస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి కార్ డ్రైవర్ గా ఉన్నటువంటి దస్తగిరి రాజకీయాలలోకి రావడం వెనక కారణం లేకపోలేదని తెలిపారు. రాజకీయంగా తనని చాలామంది ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసారని అందుకే వారికి తగిన పాఠం చెప్పడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని దస్తగిరి వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -