Bandaru Vijayalakshmi: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై దత్తాత్రేయ కూతురు ఫుల్ క్లారిటీ.. ఆ స్థానం నుంచే పోటీలోకి?

Bandaru Vijayalakshmi: తెలంగాణలో మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఇప్పటినుంచే రంగం సిద్దం చేసుకున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానికే ఇప్పుడే నిర్ణయం తీసుకుంటున్నారు. పార్టీ క్యాడర్, అనుచరులతో ఇప్పటినుంచే చర్చలు జరుపుతున్నారు. ఇప్పడే ఓ సీటు ఫిక్స్ చేసుకోవాలని పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తమకు ఫలానా నియోజకవర్గం నుంచి టికెట్ కావాలని ఇప్పుడే పార్టీకి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటినుంచే పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ప్రజల్లోకి తిరుగుతున్నారు.

ఈ క్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు అడుగులు వేస్తున్నారు. దత్తాత్రేయ రాజకీయ వారసురాలిగా పోటీలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో యాక్టివ్ గా ఉండటంతో పాటు ప్రజల్లో పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దత్తాత్రేయ కూతురిగా ప్రజల్లో పాపులర్ అవ్వుతున్నారు. ఇక అలయ్ బలయ్ ఛైర్ పర్సన్ గా ఉంటూ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో, సినీ ప్రముఖులలో పరిచయాలు పెంచుకుంటున్నారు. దీని వల్ల ప్రజలను మరింతంగా ఆకట్టుకోవచ్చని ఆమె భావిస్తున్నారు. దత్తాత్రేయ కూడా తన కూతురికి మైలేజ్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆలయ్ బలయ్ చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించి ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. రాజకీయంగా తన వారసురాలిగా ఆమెను ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో విజయలక్ష్యి క్రియాశీలకంగా పనిచేస్తుున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయలక్ష్మి బీజేపీ తరపున పోటీలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సికింద్రాబాద్ ఎంపీగా దత్తాత్రేయ బీజేపీ తరపున గెలిచారు. మరి తండ్రి స్థానం నుంచే విజయలక్ష్మి లోక్ సభ బరిలోకి దిగుతారా అనే చర్చలు మొదలయ్యాయి.

కానీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో పార్టీలో సీనియర్ గా, కేంద్రమంత్రిగా ఉన్న ఆయనకే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ పార్టీ అధిష్టానం కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి విజయలక్ష్మి పోటీలోకి దిగే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ముషీరాబాద్ లో బీజేపీ తరపున డా.లక్ష్మణ్ ఉన్నారు. కానీ ఆయనకు బీజేపీ రాజ్యసభ పదవి కేటాయించింది.

రాజ్యసభ పదవి మరో ఐదేళ్లు ఉంటుంది. దీంతో ఆయన అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ముషీరాబాద్ స్థానం నుంచి విజయలక్ష్మి పోటీ చేసే అవకావముందని ప్రచారం సాగుతోంది. లేదా జూహ్లీహిల్స్ నుంచి పోటీ చేసే అవకావముందని తెలుస్తోంది. ఇక ఆమెకు లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తే మాత్రం తన మామ జనార్దన్ రెడ్డి పోటీ చేసి చేవెళ్ల స్థానాన్ని ఎంచుకునే అవకావముందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తాజాగా నాంపల్లిలో ఆలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి… వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని, కానీ ఎక్కడ నుంచి టికెట్ ఇస్తారనేది తెలియదన్నారు.

పార్టీ ఎక్కడ టికెట్ అక్కడ నుంచి పోటీ చేస్తానని విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా.. లేదా అనేది పార్టీ నిర్ణయం అని తెలిపారు. తన సామర్థ్యం సరిపోతుందని పార్టీ గుర్తించి అవకాశం ఇస్తే పోటీ చేస్తానన్నారు. అయితే తాను పోటీ వరకు ఆలోచించలేదని, అది పార్టీ అదిష్టానం నిర్ణయించాలన్నారు. తన తండ్రి దత్తాత్రేయ సేవలు పార్టీకి ఉన్నాయని, పార్టీ తమకు తల్లి లాంటిదని విజయలక్ష్మి స్పష్టం చేశారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -