KCR-Jagan: కేసీఆర్ చేసిన ఆ పొరపాట్ల వల్లే ఓటమి.. జగన్ సైతం అవే తప్పులంటూ?

KCR-Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పనిలోనూ కేసీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. అయితే అభివృద్ధి విషయంలో మాత్రం కేసీఆర్ ని స్పూర్తిగా తీసుకోలేకపోయారు. కానీ కేసీఆర్ లోని చెడుని మాత్రం గ్రహించారు. కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూశారు. ప్రస్తుతం జగన్ కూడా అదే చేస్తున్నారు. కేసీఆర్ మాదిరిగానే జగన్ కూడా మోనార్కిజం ప్రదర్శించారు పార్టీ ప్రతినిధులతో భజనలు చేయించుకున్నారు.

 

టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమమే అజెండాగా పనిచేస్తుందని తాము కాక ఎవరు వచ్చినా కూడా సంక్షేమ ఫలాలు జనాలకు అందువని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే తీరులో ప్రవర్తిస్తుంది తాము తప్పితే జనాలకు సంక్షేమ పథకాలు ఎవరు అందిలించలేరని ప్రచారం చేస్తుంది. కేసీఆర్ మాదిరిగానే జగన్ కూడా జనాల్లోకి వెళ్ళరు, కేసీఆర్ మాదిరిగానే జగన్ మీడియా ముందుకు పెద్దగా రారు.

అంతేకాదు కేసీఆర్ యాదాద్రి ఆలయంలో తన బొమ్మ చెక్కించుకుంటే జగన్ తన పుట్టినరోజు సందర్భంగా యేసయ్య రూపంలో తన బొమ్మను గీయించుకున్నారు. అంతేకాదు ప్రతిపక్ష నేతలను దుష్టులుగా అభివర్ణిస్తూ తానేదో దైవ స్వరూపం అన్నట్లు బిల్డప్ ఇస్తారు. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ప్రతిష్టిస్తే జగన్ విజయవాడలో ప్రతిష్టించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కేసీఆర్ గవర్నర్ ని ఆహ్వానించలేదు.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఏపీ గవర్నర్ ను అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమంలో జగన్ గొప్పలు ఒక రేంజ్ లో చెప్పుకున్నారు. కానీ ప్రజలు మాత్రం వీళ్ళని ఆ రేంజ్ లో చూడటం లేదు. తెలంగాణలో కేసీఆర్ ని అహంకారానికి నిలువుటద్దంలాగా చూశారు తెలంగాణ ప్రజలు. అందుకే తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు ఇక మరొక మూడు నెలల లో జగన్ పరిస్థితి కూడా అంతే అంటున్నారు రాజకీయ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -