Sakshi Paper: జగన్ రెడ్డి సాక్షి పత్రికకు భారీ షాక్.. ఇకపై ఆ యాడ్స్ వేసుకునే హక్కు లేదా?

Sakshi Paper: క్విడ్ ప్రోకో, మనీలాండరింగ్ లాంటివి ఏపీ సీఎం జగన్ కు తెలిసినట్టు ఇంకెరికీ తెలియదని పలుసార్లు చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్దిపై ఇలాంటి విమర్శలు కామన్ అని అంతా అనుకున్నారు కానీ.. అందులో నిజం ఎంతుందో తెలియాలంటే.. సాక్షి పేపర్ సర్క్యూలేషన్ గురించి తెలుసుకోవాల్సిందే.

గత ఎన్నికలకు ముందు సాక్షి పేపర్ సర్క్యూలేషన్ రెండు నుంచి మూడ లక్షల మధ్యలో ఉండేదని ఓ అంచనా. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చన తర్వాత 6 లక్షలు దాటినట్టు తెలుస్తోంది. అంత వేగంగా సర్క్యూలేషన్ ఎలా పెరిగిందంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు కచ్చితంగా సాక్షి పేపర్ కొనాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి. వాలంటీర్ల నెల జీతమే 5 వేలు కనుక.. వారికి పేపర్ కొనుక్కోవడానికి మరో రెండు వందలు అదనంగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే.. వాలంటీర్లు సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి ప్రజాసొమ్ము వృధా చేస్తున్నారు జగన్. వాలంటీర్లతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోజూ సాక్షి పేపర్ కొనడంతో సర్క్యూలేషన్ అదనంగా మరో నాలుగు లక్షల కాపీలు పెరిగాయి.

అయితే, ప్రజల సొమ్ముతో జగన్ సొంత పేపర్ సర్క్యూలేషన్ పెంచుకుంటున్నారని మాత్రమే అనుకుంటున్నారు. ఎక్కువ పేపర్లు అమ్ముకొని పేపర్ మీద ఏడు రూపాయలు సంపాదించుకుంటున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఆ పేపర్ సర్క్యూలేషన్ చూపించి ప్రభుత్వ యాడ్స్ అన్ని సాక్షి పేపర్ కు ఇచ్చుకుంటున్నారు. ఇలా వేల కోట్లు సొంత ఖాతాలో వేసుకుంటున్నారు. జేబులో రూపాయి తీయకుండానే వేల కోట్లు సంపాధిస్తున్నారు. ప్రకటనకు చేస్తున్న ఖర్చులో సగానికి పైగా సాక్షి ఖాతాలోకే వెళ్తున్నాయి. అందుకే.. క్విడ్ ప్రోకోలో జగన్ దిట్ట అని చంద్రబాబు తరచూ అంటారు. అయితే.. సాక్షి బాగోతం ఇప్పుడిపుడే బయటపడంతో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాక్షి పేపర్ సర్క్యూలేషన్ ప్రకటించకుండా ఆపేయాలని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ప్రజాధనంతో లక్షల కాపీలు కొని.. వాటిని వాలంటీర్లకు వేసి.. ప్రజాదనాన్ని దోచుకోవడమే కాకుండా.. సర్క్యూలేషన్ ను ఎక్కువగా చూపించే కుట్ర జరుగుతోందని ఈనాడు తరుఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీంతో.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో… ప్రభుత్వ ప్రకటనలు కూడా సాక్షికి ఇవ్వడానికి లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక.. ప్రభుత్వం మారితే.. సాక్షి పేపర్, జగన్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రకటనలు ఉంటాయి. ప్రచారం కూడా పెద్ద ఎత్తున న్యూస్ పేపర్ల ద్వారానే జరుగుతోంది. అయితే, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రకటనలు ఇక.. సాక్షిలో పడే అవకాశం లేదు. మరి ఆడిట్ ఆఫ్ సర్క్యూలేషన్ నోటీసులు ఇస్తే.. జగన్ ప్రభుత్వం యాడ్స్ ను ఆపుతుందా? లేదంటే మొండిగా సాక్షికి యాడ్స్ ఇస్తుందా? అనేది కూడా ఉక్కంఠగా మారింది. ఎందుకంటే.. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం వైసీపీ ప్రభుత్వానికి కొత్తేం కాదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -