Devara movie: ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా దేవర మూవీ.. అలా జరిగితే మాత్రం చరిత్ర సృష్టిస్తుందంటూ?

Devara movie: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కాకుండా ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.. కానీ ఆ రూమర్స్ అన్ని అవాస్తవాలే అంటూ ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ స్పందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మరొక రూమర్ గట్టిగానే వినిపిస్తోంది.

 

తాజాగా ఆ రూమర్ పై మూవీ మేకర్స్ కూడా స్ట్రాంగ్ అని రిప్లై ఇచ్చారు. ఈ సినిమాను ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన మూవీ మేకర్స్ అలాంటిదేమీ లేదు ఆ వార్తలు అన్నీ కూడా అవాస్తవాలే అంటూ వాటిని ఖండించింది. ఇకపోతే దేవర సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఇప్పటికీ ప్లాన్లు కూడా చేశారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -