Chiranjeevi: చిరంజీవి జోక్యంతో మెగా డాటర్ విడాకులకు చెక్ పడినట్టేనా?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి రాగా,మెగా డాటర్ నిహారిక మాత్రం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఇక హీరోయిన్ గా ఈమె ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతుంది.

ఇలా జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్న నిహారిక కొంతకాలం పాటు తనతో సంతోషంగా గడిపినప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది.నిహారిక అత్తగారి కుటుంబ సభ్యులు తన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని అలాగే తాను ఇండస్ట్రీలో కొనసాగడం వారికి ఇష్టం లేకపోవడం వల్లే ఇద్దరు మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్లారని తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

ఇక ఈ జంట గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రమే ఏ విధంగాను స్పందించలేదు అయితే నిహారిక వైవాహిక జీవితంలో తలెత్తినటువంటి మనస్పర్ధలను చిరంజీవి చక్కదిద్దారని తెలుస్తోంది. ఇండస్ట్రీకి పెద్దగా మెగా కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి చిరంజీవి నిహారిక వెంకట చైతన్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వీరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించి పలు నిబంధనలతో వీరి విడాకులను రద్దు చేశారని తెలుస్తుంది.

ఈ విధంగా చిరంజీవి ఇన్వాల్వ్ కావటం వల్లే నిహారిక చైతన్య ఇద్దరూ వీరి విడాకులను వెనక్కి తీసుకున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇలా నిహారిక తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లి సంతోషంగా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -