CM Jagan: సంక్రాంతి విందును సీఎం జగన్ అలా ప్లాన్ చేశారా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సామాన్యులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సంక్రాంతి తొలి రోజు భోగి పండుగ సంద‌ర్భంగా ఏపీ సీఎం జ‌గ‌న్ తెల్లని వ‌స్త్రాలలో మెరిసిపోయారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన సంక్రాంతి వేడుక‌లు అంబ‌రాన్ని అంటాయి. సీఎం జ‌గ‌న్ త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

 

ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన క‌ళాకారులు త‌మ క‌ళ‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు. భోగి మంట‌లు రాజేసిన సీఎం దంప‌తులు ప్రాంగ‌ణంలో క‌లియ దిరుగుతూ అంద‌రినీ పేరుపేరునా ప‌ల‌క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ప‌లు దేవాల‌యాల న‌మూనాల‌ను ఏర్పాటు చేశారు. తిరుమ ల తిరుప‌తి దేవ‌స్థానం న‌మూనా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అదేవిధంగా కాణిపాకం వినాయ‌క‌స్వామి ఆల‌యం కూడా మంత్ర ముగ్ధుల‌ను చేసింది. ఆయా ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన సీఎం దంప‌తులుఅనంత‌రం నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను వీక్షించారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను చంద్ర‌గిరి ఎమ్మెల్యే పార్టీ ముఖ్యుడు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి అన్నీ తానై నిర్వ‌హించా రు.

సుమారు 200 మందిని ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మంలోనూ సీఎం జ‌గ‌న్ ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించారు. తాడేప‌ల్లిలోని గోశాల‌లో ప్ర‌త్యేకంగా గోపూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం 175 ర‌కాల‌ సంప్ర‌దాయ పిండి వంట‌ల‌తో అతిథుల‌కు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో స్వ‌యంగా సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిలు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -