Jagan: సీఎం జగన్ వీరసింహారెడ్డి చూసి అలాంటి కామెంట్లు చేశారా?

Jagan: టాలీవుడ్ కు సంక్రాంతి ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతి అయితే రెండు భారీ తెలుగు సినిమాలు విడుదల కాగా.. అందులో ఒకటి నందమూరి బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’. బాలయ్య బాబుకు బాగా కలిసి వచ్చే ఫ్యాక్షన్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.

పాజిటివ్ టాక్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’ సినిమా.. నందమూరి అభిమానులకు పూర్తిస్థాయి పండగను తెచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు బాలయ్య సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బాలయ్య బాబు తన కెరీర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ ను సాధించాడు.

 

బాలయ్య బాబుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ లో అత్యధికంగా రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ను కలిగిన హీరోగా బాలయ్య టాప్ లో ఉండగా.. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం సినిమా పరంగా బాలయ్య అభిమాని. గతంలో బాలయ్య సినిమా రిలీజ్ టైంలో పేపర్లో యాడ్స్ కూడా జగన్ ఇచ్చేవాడట. అయితే తాజాగా బాలయ్య సినిమాను జగన్ చూసినట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బాలయ్య వీరాభిమాని అయిన వైయస్ జగన్ కు ‘వీరసింహారెడ్డి’ సినిమా బాగా నచ్చిందట. మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య నటనకు జగన్ పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. కాకపోతే ఏపీ అధికార పార్టీని టార్గెట్ చేసేలా కొన్ని డైలాగులు ఉండకపోతే బాగుండేదని జగన్ సన్నిహితులతో అన్నారని బొగట్టా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -