Jagan: ఆ భయం వల్లే జగన్ ముందస్తు ఎన్నికలకు ఓకే చెప్పారా?

Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు ఢిల్లీ పర్యటన వెళ్లడంతో ముందస్తు ఎన్నికల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన వెళ్తున్నారంటూ పలువురు ఆరోపణలు చేయగా వైసిపి నాయకులు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని చెప్పుకొస్తున్నారు.

తాజాగా జగన్మోహన్ రెడ్డి బుధవారం కూడా కేంద్ర మంత్రులను అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసిన విషయం మనకు తెలిసిందే. ప్రధానమంత్రితో 25 నిమిషాల పాటు భేటీ అయినటువంటి జగన్ అనంతరం అమిత్ షా తో కలిసి దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘ భేటీ అయ్యారని తెలిపారు. అలాగే నిర్మల సీతారామన్ తో కూడా ఈయన బేటి అయినట్లు తెలుస్తుంది. ఇక జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ఈయన మాత్రం ముందస్తు ఎన్నికల కోసం ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది.

 

ఈ ఏడాది చివరిలో నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు ఎన్నికలను నిర్వహించడం కోసం జగన్ కేంద్రాన్ని ఒప్పించడానికి ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా చేపడుతున్నారు.

 

ఈ విధంగా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. దీంతో వైఎస్ఆర్సిపి నేతలలో ఏదో తెలియని భయం కలుగుతుందని అందుకే ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా వెంటనే ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని ఈ ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే జగన్ తరుచూ ఢిల్లీ వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి జగన్ ముందస్తు ఎన్నికల ప్రపోజల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -