NTR: జూనియర్ ఎన్టీఆర్ భార్య నుంచి ఆ ఒక్క లక్షణాన్ని కోరుకున్నారా?

NTR: సాధారణంగా ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామి విషయంలో కొన్ని కోరికలు ఉండడం సర్వసాధారణం. తమ జీవితంలోకి రాబోయే వారు ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని కలలు కంటూ ఉంటారు. అలాగే సెలబ్రిటీలు కూడా తమకు రాబోయే లైఫ్ పార్టనర్ ఇలాగే ఉండాలని భావిస్తూ ఉంటారు.ఈ క్రమంలోని జూనియర్ ఎన్టీఆర్ సైతం పెళ్లి కాకముందు తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఓ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కాక ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ తనకు కాబోయే భార్య గురించి పలు విషయాలను తెలియచేశారు. తనకు కాబోయే భార్యలో తప్పకుండా ఈ లక్షణం ఉండాలని ఎన్టీఆర్ తెలియజేశారు. తనకు వచ్చే భార్య తన తల్లిని చాలా మంచిగా చూసుకునే అమ్మాయి కావాలని ఎన్టీఆర్ తెలియజేశారు. తనకు అమ్మ అంటే చాలా ఇష్టమని అమ్మని మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలని తెలిపారు.

 

అయితే అప్పుడు ఎన్టీఆర్ చెప్పిన విధంగానే అలాంటి లక్షణం ఉన్నటువంటి అమ్మాయి తనకు భార్యగా వచ్చిందని చెప్పాలి.లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని 2011 వ సంవత్సరంలో వివాహం చేసుకున్న ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే లక్ష్మీ ప్రణతి ఇతర హీరోల భార్యల మాదిరిగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు,ఈమె కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు.

 

ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులంటూ ఇతర దేశాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈమె తన పిల్లల బాగోగులను ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇకఎన్టీఆర్ తల్లిని లక్ష్మీ ప్రణతి అత్తయ్యలా కాకుండా అమ్మలా చూసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ తనకు కాబోయే భార్యలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకున్నారో అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి తనకు భార్యగా వచ్చిందని ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -