Kalyan Ram: ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని కళ్యాణ్ రామ్ భావించాడా?

Kalyan Ram: నందమూరి వారసుడైన కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. చాలా వరకు మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో చేసి కొంతవరకు సక్సెస్ అందుకున్నాడు. కానీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. ఇక గత కొన్ని రోజుల నుండి వరుస సక్సెస్ లతో బాగా దూసుకుపోతున్నాడు.

 

ఆ మధ్య విడుదలైన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మధ్యనే విడుదలైన అమిగోస్ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం స్టార్ హోదాకు చేరుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన బింబిసారా 2 సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు.

 

ఇక 2006లో ఈయన స్వాతి అనే అమ్మాయిని కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు సినిమాలలో బిజీగా ఉన్నాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ఒక అమ్మాయిని ప్రేమించాడని కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను వదులుకున్నాడు అని తెలిసింది.

ఇంతకు ఆ అమ్మాయి ఎవరు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అని తెలిసింది. ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె సీనియర్ రోల్స్ లో చేస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో కళ్యాణ్ రామ్ ఆమెతో ప్రేమాయణం నడపగా కొంత కాలానికే ఆమెను వదులుకున్నాడట కళ్యాణ్ రామ్.

 

అది కూడా తన తండ్రి హరికృష్ణ వల్ల వదులుకున్నట్లు తెలిసింది. నందమూరి కుటుంబంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో వివాహం జరిగితే ఇంటికి అరిష్టమని.. అందుకే ఆ కారణంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని రిజెక్ట్ చేశాడు అని.. అంతేకాకుండా తండ్రి మాటను కాదనకుండా అమ్మాయిని వదులుకున్నాడు అని తెలిసింది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -