Manchu Lakshmi: మోకాళ్లు చూపిస్తూ అలా కనిపిస్తున్న మంచు లక్ష్మి.. చివరకు ఇలాంటి పాత్రలు చేయాల్సి వస్తోందా?

Manchu Lakshmi:  టాలీవుడ్ నటి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ముఖ్యంగా తన లాంగ్వేజ్ తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడంతో పాటు ఎన్నో రకాల ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంది. ఆ ట్రోలింగ్స్ ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. ఇకపోతే మంచు లక్ష్మి ప్రస్తుతం అడపదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈమె తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఆదిపర్వం. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అక్టోబర్ 8న మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ..

మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయి అని అన్నారు. రెట్రో ఫీల్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆద్యంతం అలరించే చిత్రమిది అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావ్ అన్నారు. ఇకపోతే ఈ మూవీలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆ పోస్టర్లో మాస్ క్యారెక్టర్ లో అదిరిపోయే లుక్ తో చాలా మాస్ గా కనిపిస్తోంది మంచు లక్ష్మి. కొందరు ఈ పోస్టర్ పై పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. మోకాళ్ళు చూపిస్తూ అలాంటి పోస్టర్ ఏంటి?చివరకు మంచు లక్ష్మి ఇలాంటి పాత్రలు కూడా చేస్తుందా అంటూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -