Manchu Lakshmi: మంచు లక్ష్మీ తేడానా.. ఆ విషయంలో మంచు లక్ష్మి ట్వీట్ వెనుక అసలు కథ ఇదేనా?

Manchu Lakshmi: సేమ్ సెక్స్ మ్యారేజ్ కి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై మంగళవారం నాడు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకుంటే చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురు కాకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని అభిప్రాయపడింది. అలాగే వారి సహజీవనం గురించి ఏవైనా ఫిర్యాదులు అందితే పోలీసులు విచారణ జరిపే హక్కు ఉంటుందని తెలిపింది.

అయితే ఆ విచారణ పేరుతో వేధించకూడదని కూడా ఆదేశించింది. స్వలింగ జంటలు తమ పెళ్ళిళ్లను రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా క్లైమ్ చేయరాదని తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించిన చట్టాన్ని మార్చే అంశం పార్లమెంట్ పరిధిలో ఉందని వెల్లడించింది ఈ తీర్పుపై పదిమంది పలు విధాలుగా తమ అభిప్రాయాలని తెలియజేశారు. అందులో మన మంచు అక్క కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసి ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతుంది.

సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పై నటి మంచు లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తీర్పు తనకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొంది. సేమ్ జెండర్ వివాహాలకు సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించలేమని చెప్పటం నాకు తీవ్ర నిరాశను కలిగించింది. నా గుండె పగిలేలాగా చేసింది అన్ని రకాల ప్రేమలను స్వీకరించి మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజంగా అవమానం ఇతర దేశాల్లో ఎవరికి వారు స్వేచ్ఛగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.

మనదేశంలో సేమ్ జెండర్ మ్యారేజెస్ను అంగీకరించలేమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికి ఆమె ట్రోల్స్ కి గురవడం ప్రారంభించింది. ఈమె తేడానా అంటూ నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మంచు లక్ష్మి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి అయితే మంచు లక్ష్మి తో పాటు చాలామంది సెలబ్రిటీలు సుప్రీంకోర్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎవరికి నచ్చినట్లు వారి జీవించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -