Prabhas Maruthi: ప్రభాస్ మారుతి కాంబో సినిమాకు అలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారా?

Prabhas Maruthi: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా అంటే ఎలాంటి హంగు ఆర్భాటం ఉంటుందో మనకు తెలిసిందే. ప్రభాస్ ఒక సినిమాకు కమిట్ అయ్యారు అంటే ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా భారీ స్థాయిలో ఉంటుంది. అలాగే పూజా కార్యక్రమాలు ఇతరత సినిమా అప్డేట్ లో కూడా అదే స్థాయిలో ప్రకటిస్తూ ఉంటారు.కానీ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలవడకుండా ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి మారుతి సిద్ధమయ్యారు.

ఇలా ప్రభాస్ వంటి స్టార్ హీరోతో తనకు ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు మారుతి సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు టైటిల్ ఇదేనంటూ గత కొద్దిరోజులుగా ఒక టైటిల్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది.ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడం ఏంటి అని చాలామంది అభిమానులు పెదవి విరిచారు.

 

ఈ సినిమా ఒక థియేటర్ కాన్సెప్ట్ తో రాబోతుందని ఆ థియేటర్ పేరే రాజా డీలక్స్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పాకిపోయింది. అయితే ఇది నిజం కాదని మరో వార్త పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు టైటిల్ కూడా మార్చేశారని తెలిసి మరొక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్, మారుతి డైరెక్షన్లో రాబోతున్న సినిమాకు అంబాసిడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.

 

ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.ఇక అంబాసిడర్ అనే టైటిల్ విషయంలో కూడా అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద ఓ అనౌన్స్ మెంట్, వర్కింగ్ టైటిల్ లేకుండానే ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా రెడీ చేయడం అంటే రికార్డే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -