Allu Arjun: బన్నీకి జాతీయ అవార్డ్ రావడంతో ఆ స్టార్ హీరో పేపర్లను కాల్చేశారా.. అసలేం జరిగిందంటే?

Allu Arjun: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. 2021 లో విడుదల అయిన పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కూడా అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఖాతాలో చాలా రకాల యాడ్స్ కూడా వచ్చి చేరుతున్నాయి.. ఇకపోతే అసలు విషయానికి వస్తే.. గత మూడు రోజుల క్రితం ఈయన ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపతి చేతుల మీదుగా ఈ నేషనల్ అవార్డును అందుకున్నారు.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అల్లుఅర్జున్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి జాతీయ అవార్డును ఏ హీరో కూడా అందుకోకపోవడం గమనార్హం. ఇలా మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్నటువంటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఇలాంటి మంచి గుర్తింపు సంపాదించుకోవడం ఒక టాలీవుడ్ హీరో కి ఏమాత్రం డైజెస్ట్ కాలేదట. కనీసం ఆయనకి విష్ చేయకపోవడమే కాకుండా అల్లు అర్జున్ ఈ నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఫోటోలు అన్ని పేపర్లలో రావడంతో ఆ పేపర్లు చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారట.

తనకంటే వెనక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఆ హీరో ఇలా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇంత మంచి అవార్డులను కూడా అందుకోవడంతో ఆ హీరో సహించలేకపోయారట. అల్లు అర్జున్ పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫోటోలు ఉన్నటువంటి పేపర్లన్నింటిని కూడా కాల్చి తన కోపాన్ని తగ్గించుకున్నారని తెలుస్తోంది. ఇలా ఒక హీరో ఇండస్ట్రీలో సక్సెస్ అయితే ఓర్చుకోలేనితనం ఆ హీరోకి ఉండడంతో ఇలా ప్రవర్తించారని తెలుస్తోంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సాటి హీరో ఇలాంటి సక్సెస్ అందుకుంటే అభినందించాల్సింది పోయి ఇలా బాధపడటం దేనికి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -