Tamannaah: మెగాస్టార్ నొప్పి గురించి తమన్నా అలా అన్నారా.. అసలేమైందంటే?

Tamannaah: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిరు ఇప్పుడు బోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా భోళా శంకర్ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. దాంతో దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ముఖానికి సర్జరీ అయినట్లు వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాల్లో, వార్తల్లో కూడా చిరంజీవి మోకాలి సర్జరీ కోసమే అమెరికాకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా మాట్లాడుతూ.. చిరంజీవి గారికి మోకాలి నొప్పి ఉంది. ఒక సాంగ్ షూట్ లో చిరంజీవి గారికి మోకాలి నొప్పి ఎక్కువ అయ్యింది. కానీ ఆయన ఎంత నొప్పి ఉన్నా బయటకి చెప్పకుండా షూట్ లో యూనిట్ కి తెలియకుండా వర్క్ చేశారు.

 

తన వల్ల షూట్ ఆగిపోకూడదని, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ అడిగిన పర్ఫెక్షన్ ఇవ్వడానికి తన నొప్పిని దాచి పని చేశారు చిరంజీవి. అలాంటి డెడికేషన్, ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అని తెలిపింది. అయితే తమన్నా చెప్పిన మాటలను బట్టి చూస్తే చిరంజీవి భోళా శంకర్ సినిమా సమయంలో మోకాలి నొప్పితో బాగా బాధపడ్డారని తెలుస్తోంది. దీంతో చిరంజీవి మోకాలి సర్జరీకి అమెరికా వెళ్లిన వార్తలు నిజమేనేమో అని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -