Allu Arjun: ఆ హీరోయిన్ పెళ్లి అల్లు అర్జున్ ను ఎంతగానో బాధ పెట్టిందా?

Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2021 లో విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. పుష్ప పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ లో అర్జున్ చీర కట్టుకొని కనిపించడంతోపాటు ఒక అమ్మోరులా కనిపించారు. దాంతో ఆ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఇకపోతే బన్నీ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా భార్యాపిల్లలతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్. ఇకపోతే అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించక ముందే మరో స్టార్ హీరోయిన్ ని ఎంతో పిచ్చిగా ప్రేమించారట.

మరి ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు మిస్ వరల్డ్ గా నిలిచిన మాజీ ప్రపంచ చందరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్. అల్లు అర్జున్ ఐశ్వర్యరాయ్ ఎప్పుడైతే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి పరిచయమైందో అప్పటినుంచి తనకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయిందట. అదే సమయంలో హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఐశ్వర్యరాయ్ ఎప్పుడైతే అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకుందో ఆ సమయంలో అల్లు అర్జున్ ఎంతో బాధ పడ్డారట.

ఇదే విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను ఇష్టమైన అమ్మాయిలు ఎంతలా ఏడ్చారో అంతకంటే ఎక్కువగా నేను ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకున్నప్పుడు బాధపడ్డాను అంటూ అల్లు అర్జున్ తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ వార్త మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -