Jagan: జగన్ వస్తానని చెబితే ఆ ఎంపీ ఇంత దారుణంగా ప్రవర్తించారా?

Jagan: జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడని ప్రజలు నీరాజనం పడుతున్నారంటూ సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడినుంచి ఎక్కడికి పడిపోయిందనే విషయానికి చక్కటి ఉదాహరణ ఈ సంఘటన అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే ఢిల్లీలోని కేంద్రం పెద్దలను కలిసిన అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్తున్నట్లు సీఎంఓ ఆఫీస్ నుంచి కబురు వెళ్ళింది.

 

ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి మీ ఇంట్లోనే డిన్నర్ చేస్తారంటూ సీఎంఓ ఆఫీస్ నుంచి కాల్ వెళ్లగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పిన సమాధానం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అనడానికి అద్దం పడుతుందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వస్తారు అంటూ ఎంపీకి చెప్పగా ఆయన మాత్రం మేము ఊర్లో ఉండడం లేదు అంటూ పరోక్షంగా మా ఇంటికి రావద్దు అంటూ తలుపు వేసినట్టు చెప్పకనే చెప్పేశారు.

ఈ ఒక్క సంఘటన చాలు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవడానికి సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు కానీ ఈ ఎంపీ మాత్రం తాము ఊర్లో లేమని ఇంటికి తాళాలు వేసుకొని తన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లిపోయారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు అనౌన్స్ చేశారు జగన్ అయితే ఆయన మూడు నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తే జగన్ ఒకచోట మార్చినట్లే మార్చి తిరిగి ఎంపి అనిల్ అనుచరుడిని ఇన్చార్జిగా పెట్టారు దీంతో తనకు అవమానం జరిగిందని భావించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదని వచ్చే ఎన్నికలలో ఆయన ఓడిపోవడం పక్కా అని తెలిసి ఇప్పటికే తన దారి తాము చూసుకుంటున్నానమని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -