Oscar: నాటు నాటుకే కాదు.. మరో ఆస్కార్ అవార్డ్ వచ్చిందని తెలుసా?

Oscar: ఆస్కార్ అవార్డుల ప్రదానం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జ‌రుగుతున్న ఆస్కార్ వేడుక‌ల్లో భార‌త సినిమాలు స‌త్తా చాటుతున్నాయి. బెస్ట్ డాక్యుమెంట‌రీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ ఆస్కార్ గెలుచుకుంది.

మ‌హిళ డైరెక్ట‌ర్ కార్తీకి గోన్సాల్వేస్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఆస్కార్ వేడుక‌లో కార్తీకి ఈ అవార్డును స‌గ‌ర్వంగా అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భార‌త్ కు ఇదే తొలి ఆస్కార్ కావ‌డం విశేషం. ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ షార్ట్ ఫిలిమ్ గ‌తేడాది డిసెంబ‌ర్ లో రిలీజైంది. మరోవైపు తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఒరిజినల్ సాంగ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ కు ఆవార్డు వరించింది.

 

ద ఎలిఫెంట్ విష్పరర్స్ డైర‌క్ట‌ర్ కార్తికీ గొన్సాల్వేస్ వయసు 37 సంవత్సరాలు. డాక్యురీమెంటరీ కోసం ఆమె ఐదేళ్లు కష్టపడ్డారు. తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు. ఇదంతా కథ కాదు నిజ జీవితంలో బొమ్మ, బెల్లీలు చేసే పనిని ఐదేళ్ల పాటు అందంగా విజువలైజ్ చేశారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్వెన్ ఫాల్కనర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. చాలా సీన్లలో హార్ట్ మెల్ట్ అయిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -