Tammineni: తమ్మినేని డిగ్రీకి సంబంధించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Tammineni: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని నకిలీ సర్టిఫికెట్ల గురించి టిడిపి బయట పెట్టిన విషయం తెలిసిందే. దాంతో స్పీకర్ నకిలీ సర్టిఫికెట్ల స్కాంలో నిండా మునిగారు. తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని టీడీపీ బయట పెట్టేసింది. దాంతో తమ్మినేని చదివాను అని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకు అన్ని వివరాలు సేకరించి చివరికి ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని ఆధారాలు బయట పెట్టింది. అయితే ఇప్పుడు ఆయన రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నకిలీ డిగ్రీ ఇచ్చిన తమ్మినేనిపై పోలీసులకు ఆయనకు లా అడ్మిషన్ ఇచ్చిన కాలేజీ కానీ తమ పేరుతో నకిలీ డిగ్రీ తయారు చేశారన్న కారణంగా యూనివర్శిటీ పై కేసులు పెట్టలేదు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయట పడితే వెంటనే యూనివర్శిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీని బయట పెట్టింది. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే దానికి అంత విలువ రాదు. తమ సర్టిఫికెట్లు ఫేక్ చేసినందుకు యూనివర్శిటీ లేదా కాలేజీ పోలీసులు కేసు పెట్టాలి. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు.

 

ఎందుకు తయారు చేశారు. ఇలా ఎన్ని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారు అన్నది తేలిస్తే చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆయనపై ఈగ కూడా వాలదు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే. అయితే తమ్మినేని సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆయన బయటపడటం కష్టం. వచ్చే ఎన్నికల తర్వాత ఆయనకు స్పీకర్ పదవి ఉండదు. అయితే ఈ విషయంపై కచ్చితంగా యూనివర్సిటీలు అలాగే పోలీసులు కచ్చితంగా కేసు పెడితే తమ్మినేని జైలుకు వెళ్లడం ఖాయం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -