Galla Jayadev: గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి అసలు రీజన్లు ఇవే!

Galla Jayadev: తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదని అలాగే తన నిర్ణయం కేవలం తాత్కాలికం అని ఆయన తెలిపారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ఆయన వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను.

 

నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉంది. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను. కానీ, రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను. రెండేళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నాను అని గల్లా జయదేవ్‌ వెల్లడించారు. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర సమస్యలు, ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో పోరాడాను.

రాజధానిగా అమరావతికే మద్దతిస్తాను. ప్రభుత్వం నుంచి బయటకి వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టారు. ఆ సమయంలో పార్టీ గొంతు నేనే వినిపించాను. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది. నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నాయి అని జయదేవ్‌ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -