Vishwak Sen: ఆ గెటప్ లో విశ్వక్ సేన్ ను చూసి ముష్టివాడు అని అనుకున్నారా?

Vishwak Sen: విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గామి. ఈ సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది మూవీ టీం. పోస్టర్లో అఘోర గా కనిపిస్తున్న విశ్వక్ సేన్ డిఫరెంట్ లుక్ తో మూవీ పై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. విద్యాధర్ కగిట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సెల్యులాయిడ్ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.

 

చాందిని చౌదరి, ఎంజి అభినయ, మహమ్మద్ సమద్, దయానంద రెడ్డి హారిక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం గత నాలుగు ఏళ్లుగా పనిచేస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు. అలాగే షూటింగ్ సమయంలో జరిగిన గమ్మతైన సంగతి గురించి కూడా చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్. అఘోర గెటప్ లో ఉన్న విశ్వక్ సేన్ ని చూసి అక్కడ ప్రజలు నిజంగానే ముష్టివాడు అనుకోని డబ్బులు వేశారంట. ఆ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

ఈ చిత్రం నుంచి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక వ్యక్తి ప్రత్యేకమైన కథ అతి పెద్ద భయాన్ని జయించేందుకు అతడు ప్రయాణం అంటూ ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ ను షేర్ చేశారు. పోస్టర్ లో విశ్వక్ అఘోరా గా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ మూవీ పై మరింత ఆసక్తిని పెంచేసింది. మానవ స్పర్సే అతడి అతిపెద్ద భయం అతడే అమితమైన కోరిక కూడా మానవ స్పర్సే అని పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ తో స్టోరీ ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

 

ప్రస్తుతం విశ్వక్సేన్ మూడు సినిమాలను లైన్లో సిద్ధం చేస్తున్నారు మూడు సినిమాలలోనూ 3 డిఫరెంట్ రూల్స్ అండ్ గెటప్స్ కనిపించబోతున్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో గోదారి కుర్రాడిగా ఆఫ్ హెయిర్ కట్ తో కనిపించబోతున్నారు. సినిమాలో మాస్ లుక్ తో దర్శనమిస్తున్నారు ఇక గామి సినిమాలో అఘోరగా కనబడనున్నారు. మరి స్క్రీన్ పై అఘోర గా విశ్వక్ ఎలా మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమాని మార్చి 8న రిలీజ్ చేయబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -