Vishwak Sen: విశ్వక్ సేన్ పరువు గంగలో కలిసిందిగా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ ఏంటో తెలుసా?

Vishwak Sen: సినిమాలతో కన్నా తన దూకుడు ప్రవర్తన తోనే ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటాడు నటుడు విశ్వక్ సేన్. తాజాగా ఒక ట్వీట్ పెట్టి మరొకసారి వైరల్ అవుతున్నాడు ఈ మాస్ కా దాస్ . ఇంతకీ ఏం జరిగిందంటే అతను నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ లో రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇందులో విశ్వక్ సేన్ కు హాట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్గా జతకట్టింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామాగా సినిమా ఉండనుంది.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలు మంచి ఆసక్తి పెంచాయి. ఇందులో హీరోయిన్ అంజలి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమాని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.అయితే ఇప్పుడు విడుదల విషయంలో విశ్వక్ సేన్ ఫైర్ అవుతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు.

నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పనిచేసే చెబుతున్నా. డిసెంబర్ 8న వస్తున్నాము. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారనేది మీ ఇష్టం, అది మీ నిర్ణయం. ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణయం కాదు, తగ్గే కొద్ది మింగుతారు అని అర్థమైంది. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది, గంగమ్మ తల్లికి నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది డిసెంబర్లో సినిమా రాకపోతే..

నేను ప్రమోషన్ లో కనిపించను, రాను అని ఫైర్ అవుతూ ఇంస్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చాడు. అయితే నిర్మాత నాగ వంశీ డిసెంబర్ రెండవ వారంలో సినిమా రిలీజ్ చేయడానికి ఎప్పుడో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశ్వక్ సేన్ ని ఒప్పించి ప్రమోషన్స్ కి తీసుకు వస్తారు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -