Vishwak Sen: తిట్టడం వరకు ఓకే విశ్వక్ సేన్.. ప్రచారం చేయనని చెప్పడం ఎంతవరకు న్యాయమంటూ?

Vishwak Sen: సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి వారి సినిమాలకు ఎంతో మంచి పేరు పలుకుబడి ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. సినీ బ్యాగ్రౌండ్ లేకపోతే ఆ హీరోల సినిమాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితిని విశ్వక్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఈయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయంలో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ సంచలనగా మారింది.

ఇక ఈ సినిమా విషయంలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విశ్వక్ తగ్గే కొద్ది మింగుతారు అంటూ వల్గర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు అంటూ మరొక స్టేట్మెంట్ ఇచ్చారు ఇలా ఈయన బూతులతో స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్లకు రాను అంటూ కూడా చెప్పడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

విశ్వక్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేశారు అయితే ఈ సినిమా ముందుగా డిసెంబర్ 8వ తేదీ విడుదల చేయాలని భావించారు. కానీ సలార్ సినిమా డిసెంబర్ నెలలో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయంలో తారుమారు వచ్చాయి అయితే నాని హాయ్ నాన్న సినిమా ఫ్రీ ఫోన్ కావడం అలాగే నితిన్ వరుణ్ తేజ్ వంటి వారందరి సినిమాల్లో కూడా ఒకేసారి విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలి అంటూ తెరవెనుక నుంచి అధిక ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే చిన్న బ్యానర్ కాదు ఎన్నో సినిమాలను విడుదల చేసి మంచి కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో సినిమాలను మార్కెట్ చేసిన ఘనత కూడా ఈ బ్యానర్ కి ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలి అనే క్యాలిక్యులేషన్స్ కూడా వారికి ఉంటాయి కానీ ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల కాకపోతే తాను ప్రచారానికి రాను అంటూ విశ్వక్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే ప్రతి సినిమా విడుదలకు ముందు విశ్వక్ ఇలా ఏదో ఒక వివాదం సృష్టించి ఆ వివాదం ద్వారా ఆయన లబ్ధి పొందడం ఆయనకు అలవాటే నట్టు కొందరు విశ్వక్ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -