NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మరో అరుదైన ఘనత సొంతమైందా?

NTR: తాజాగా 95 వ ఆస్కార్ అవార్డు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి అవార్డు గెలుచుకొని ఆర్ఆర్ఆర్ మూవీ చరిత్ర సృష్టించిన సంగతి మనందరికి తెలిసిందే. గత రెండు వారాలుగా ఈ సినిమా పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతోంది. కాగా ఈ సినిమాలో ఈ మూవీ, ఇందులో హీరోలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రపంచస్థాయిలో మరో ఘనత సాధించడం విషయం తెలిసిందే.

ఆస్కార్ వేడుక సందర్భంగా మీడియా, సోషల్ మీడియాలో అత్యధికంగా మెన్షన్ చేసిన టాప్ 5 సినిమాల లిస్టులో ఆర్ఆర్ఆర్ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ రెండో స్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రం సహా మొత్తం ఏడు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాని సైతం వెనక్కి నెట్టి మొదటి రెండు స్థానాల్లో భారతీయ సినిమాలు నిలిచాయి. ఇకపోతే యాక్టర్స్ విషయానికి వస్తే.. హాలీవుడ్ స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి జూనియర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.

 

దీంతో ఎన్టీఆర్ మరో ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు. మొత్తానికి ఆస్కార్స్ సమయంలో మీడియా, సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ డామినేషనే కనిపించింది. ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో చెర్రీ తారక్ లు పాన్ ఇండియా స్టార్ లుగా మారిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -