Dil Raju: దిల్‌రాజు రిస్క్ తీసుకుంటారా? జాగ్రత్తగా ఉంటారా? న్యూమరాలజిస్ట్ ఏం చెప్పారు!

Dil Raju: సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెంటిమెంట్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జాతకాలు, నంబర్లు, అక్షరాలు, వాస్తు దోషం ఇలా ప్రతి విషయాలను బలంగా నమ్ముతుంటారు. అందుకే చాలా మంది హీరో హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు తమ ఒరిజినల్ పేరుతో కాకుండా వేరే పేరుతో ఇండస్ట్రీలోకి పరిచయం అవుతారు. అలా వారు సినీ ఇండస్ట్రీలో గెలుపును సొంతం చేసుకుంటారు. అయితే కొందరికి పేరు, ఆస్తి, వాహనాలు, ఇల్లు ఇలాంటి కొన్ని వస్తువుల వల్ల కూడా లక్ కలిసోస్తుంటుంది. జాతకాలతోపాటు న్యూమరాలజీని కూడా బాగా నమ్ముతారు.

న్యూమరాలజీ ప్రకారం.. ఒక్కో వ్యక్తికి తన పుట్టిన రోజు, తన పేరు ఆధారంగా లక్కీ నంబర్ ఉంటుంది. ఆ లక్కీ నంబర్‌నే అధికంగా వాడితే లాభాలు వస్తాయని న్యూమరాలజిస్ట్‌ లు చెబుతుంటారు. ఒక వేళ ఆ నంబర్ ఉపయోగించడం వల్ల అదృష్టం కలిసి వచ్చినట్లయితే వారూ ఇంకా అప్పటినుంచి అదే నంబర్‌ను కంటిన్యూ చేస్తుంటారు. తాము కొనే వాహనాలను అదే రోజు, అదే వాహనం ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకు అధిక మొత్తంలో డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధమవుతారు.

ఇలాంటి నమ్మకాలను పాటించడంలో స్టార్ నిర్మాత దిల్‌రాజు కూడా ఒకరు. దిల్‌రాజ్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. జ్యోతిష్యాలు, ముహుర్తాలు, న్యూమరాలజీని బాగా నమ్ముతారు. దిల్‌రాజు ఎప్పటికప్పుడు ఏ ప్రాజెక్ట్ ప్రారంభించాలని అనుకున్నా.. ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్‌ ను సంప్రదిస్తాడని సమాచారం. అలా ఇటీవల ఆ న్యూమరాలజిస్ట్ ను నిర్మాత దిల్‌రాజ్ సంప్రదించినట్లు సమాచారం. అప్పుడు ఆయన షాకింగ్ విషయాలు తెలిపాడట. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు తొందరపడి ఓకే చేయొద్దని, రిస్కీ ప్రాజెక్టులకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారట. దీంతో అప్పటినుంచి కొంచెం జాగ్రత్త వహిస్తున్నట్లు, ఉన్న ప్రాజెక్టుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -