Director Krishna Vamsi: చిరు రీమేక్ సినిమాలు చేస్తున్నన్న వారికి కౌంటర్ ఇచ్చిన కృష్ణవంశీ.. ఇంతకు ఏమన్నారంటే?

Director Krishna Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో సమానంగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. సినిమా ఆఫర్స్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఇండస్ట్రీలో మరో స్థాయిలో హడావిడి చేస్తున్నాడు. టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా చిరంజీవి ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక చిరు త్వరలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి గాడ్ ఫాదర్ సినిమా మన అందరికీ తెలిసిందే.

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళం లో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను ఈ దసరాకి ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతారలు ప్రధాన పాత్రలకు పోషిస్తున్నారు కాబట్టి ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ఈ మధ్య రీమేక్ సినిమాలు చేస్తున్నారు అని చాలామంది అంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ చిరంజీవి కేవలం రీమేక్ లు చేస్తున్నాడు అనే వారికి మంచి సమాధానం ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చిరంజీవి గురించి మాట్లాడుతూ బోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాలు మాత్రమే చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు. రీమేక్ చేయడం అంత సులభమేమీ కాదు. వాళ్లు మొత్తం సినిమాను ఎడాప్ట్ చేస్తున్నారు. ఇది అంత ఈజీ కాదు. ఇది టోటల్ గా న్యూ ప్యాకేజ్ గా చేస్తున్నారు అని కృష్ణ వంశీ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఇక చిరంజీవి రాబోయే సినిమాల విషయానికి వస్తే బోళా శంకర్ సినిమా మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మెగా 154 అనే ప్రాజెక్టు కూడా త్వరలో రాబోతుందట. ఈ సినిమాకు కె ఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో చిరు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -