Nagababu: మెగా ఫ్యామిలీలో చిచ్చు మొదలైందా… సంచలనంగా మారిన నాగబాబు పోస్ట్!

Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ములను ఎవరు పరోక్షంగా ఉద్దేశించి కామెంట్లు చేసిన వెంటనే అందరూ ఒకటై స్పందిస్తూ తమ కుటుంబం గురించి వస్తున్న వార్తలను తిప్పి కొడతారు.అలాగే ఈ ముగ్గురిలో ఎవరికి ఎలాంటి కష్టాలు వచ్చినా అండగా ఉన్నామని అందరూ ఎంతో ఐకమత్యంగా ఉంటారు.

కేవలం ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రమే కాకుండా ఆయన వారసులు కూడా ఇండస్ట్రీలో ఎంతో ఐకమత్యంగా స్నేహభావంగా ఉంటారని చెప్పాలి.ఇలా ఇన్ని రోజులపాటు ఎంతో కలిసిమెలిసి ఉన్న ఈ కుటుంబంలో కూడా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని ఈ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు చేసిన పోస్టులు పెద్ద ఎత్తున ఈ అనుమానాలకు దారితీస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా , నటుడిగా గుర్తింపు పొందిన నాగబాబు హీరోగా రాణించలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈయన బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జనసేన పార్టీ కార్యక్రమాలలో కీలకంగా పాల్గొన్న నాగబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పెద్ద ఎత్తున పార్టీ తరపున ప్రచారం చేస్తూ పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్తున్నారు. అయితే ఇటు రాజకీయాలలోనూ అటు ఇండస్ట్రీలోను బిజీగా ఉంటున్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన చేసే పోస్టులు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి.

గత రెండు రోజుల క్రితం నాగబాబు తాను అంత సులువుగా ఎవరిని వదులుకోనని ఒకవేళ వదులుకున్నాను అంటే వాడంత పెద్ద ఎదవ ఎవరు ఉండరంటూ కామెంట్ చేశారు.ఇక నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారని అనుకునే లోపే ఈయన మరొక పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా మంచివాడు శత్రువు కైనా సహాయం చేస్తాడు…. చెడ్డవాడు తోడు పుట్టిన వాడినైనా ముంచేస్తాడు. మంచి వాళ్లను దూరం చేసుకుంటే ముంచేవాళ్లే దగ్గరవుతారు అంటూ ఒక కొటేషన్ షేర్ చేశారు. ఇలా ఈయన ఈ కొటేషన్ షేర్ చేయడంతో ఈ కొటేషన్ కేవలం తన అన్నయ్యను ఉద్దేశించి చేశారని,మెగా ఫ్యామిలీలో కూడా వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందువల్లే ఇలాంటి కొటేషన్ షేర్ చేశారు అంటూ పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి ఈయన ఏ ఉద్దేశంతో అలాంటి కొటేషన్ షేర్ చేశారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -