YCP: 2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఎన్నో మీకు తెలుసా?

YCP: మరోక సంవత్సరంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకుంది.ఏ పార్టీలో నాయకులు ఆ పార్టీలో తమకు సీటు వస్తుందా రాదా టికెట్ ఇస్తారా లేదా అన్న సందిగ్ధంలో కొనసాగుతూ కొందరు నాయకులు పార్టీలు మారుతూ రాజకీయాలలో కొనసాగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే…ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో వందకు వంద శాతం తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు అసెంబ్లీ ఎన్నికలలో పోటీపడుతుండగా 175 స్థానాలు తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా తమ పార్టీపై నమ్మకంతో ఉన్న ప్రజలలో అంత నమ్మకం లేదని ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికలలో వచ్చిన 151 సీట్లు కూడా ఈసారి రావడం కష్టమని పలువురు తెలియజేస్తున్నారు. ముందులాగ ప్రజలలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రజలలో నమ్మకాలు లేవని అదే ప్రమాదకరంగా మారబోతుందని తెలుస్తుంది.

 

ఇక అసెంబ్లీ స్థానాలు పక్కన పెడితే పార్లమెంటరీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీకి 24 గురించి 25 సీట్లు గెలుస్తాయని తాజాగా టైమ్స్ నౌ- నవభారత్ సర్వే వెల్లడించింది అయితే ఈ విషయం ప్రస్తుతం సంచలనగా మారింది.మునుపటిలాగా 22 సీట్లు వస్తాయని చెప్పడంలో అర్థం ఉంది కానీ 25 కు 25 సీట్లు గెలుస్తాయని చెప్పడం కాస్త హాస్యాస్పదంగానే ఉందని చెప్పాలి.

 

ఇలా వైసిపి ప్రభుత్వం అన్ని స్థానాలలోనూ వైఎస్ఆర్సిపి పార్టీ జెండాఎగురుతుందని ఈ సర్వేలో రావడంతో పలువురు ప్రతిపక్ష నేతలు ఈ సర్వే పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.అయితే మరికొందరు ఈ సర్వేపై వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. మునుపటిలాగా ప్రజలలో వైసిపి పార్టీపై నమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ స్థాయిలో ఎంపీ స్థానాలలో గెలవడం ఆసాధ్యమని మరికొందరు వాదన.2024 ఎన్నికలలో ఈ సర్వే వెల్లడించిన స్థాయిలోనే జగన్ పార్టీ గెలుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -