Protect Your Skin: వేసవిలో చర్మాన్ని ఎలా పరిరక్షించుకోవాలో తెలుసా?

Protect Your Skin: ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. ఎండా కాలంలో బాడీ డిహైడ్రేట్ అవడం అన్నది ఒక సమస్య అయితే చర్మ సమస్యలు మరో సమస్య అని చెప్పవచ్చు. ఎందుకు చర్మం కందిపోవడం నల్లగా మారడం లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దానికి తోడు విపరీతమైన చెమట వల్ల చర్మం పై రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వేసవికాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎండాకాలమనే చర్మాన్ని సంరక్షించుకోవల్సిన అవసరం ఉంటుంది. ఇతర సీజన్ లతో పోలిస్తే వేసవిలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎండల తీవ్రత దృష్ట్యా అదనపు జాగ్రత్తలు అవసరం. చర్మాన్ని సంరక్షించుకోవడమనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే చర్మం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వేసవిలో ఎండల తీవ్రత నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవల్సిన అవసరముంది. ఎందుకంటే సూర్యుని నుంచి నేరుగా వచ్చే అతి నీలలోహిత కిరణాలు కల్గించే హాని నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. అందుకే వేసవి వచ్చిందంటే చాలా సన్‌స్క్రీన్ లోషన్స్ ఎక్కువగా వాడుకలో వస్తుంటాయి.

 

సన్‌స్క్రీన్ లోషన్స్ ద్వారా స్కిన్‌కేర్ తప్పనిసరి. ఇక వేసవిలో చాలామందికి చెమట కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు క్లెన్సర్ వాడటం మంచిది. అయితే రసాయనాలు లేని క్లెన్సర్ వాడటం మంచిది. ఇక వేసవి వేడిలో ముఖానికి నూనె లేదా సీరమ్ ఉపయోగించడం ఏ మాత్రం మంచిది కాదు. వేసవి కారణంగా చెమట, జిడ్డు ఎక్కువగా ఉంటుంది. నూనె వంటివి రాస్తే చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. అలాగె డీ హైడ్రేషన్ సమస్య.. వేసవి కాలంలో సాధ్యమైనంత వరకూ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. చర్మానికి తగిన తేమ లేకపోతే అనారోగ్యం కారణంగా చర్మ సమస్యలు వెంటాడుతాయి. బ్లాక్‌హెడ్స్, డ్రై స్కిన్ వంటివి సమస్యలు ఎదురవుతాయి. చర్మం తేమగా ఉండేందుకు వీలుగా మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ వాడాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు వీలుగా వేసవిలో ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. ఇతర సీజన్‌లతో పోలిస్తే వేసవిలో నీళ్లు అధికంగా తీసుకోవాలి. ఎండకు ఎక్స్‌పోజ్ అయినప్పుడు అంటే బయటకు వెళ్లినప్పుడు ముఖంపై అలసట, చికాకు లేకుండా ఉండాలంటే టోనర్ తప్పకుండా వాడాలి. టోనర్ అనేది చర్మంలో పీహెచ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఎండలోంచి వచ్చిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవడమనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. రోజుకు 3 లేదా 4సార్లు నీళ్లతో శుభ్రం చేసుకుంటే ట్యానింగ్ సమస్య పోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -