Skinny Jeans: వామ్మో.. వేసవిలో స్కిన్నీ జీన్స్ ధరిస్తే అంత ప్రమాదమా?

Skinny Jeans: స్కిన్నీ జీన్స్.. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్కిన్నీ జీన్స్ దరించడం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. టైట్ గా ఉండే జీన్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఆడవారు ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా యువత అయితే ప్రతి పదిమందిలో 8 మంది ఈ జీన్స్ ని ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈ స్కిన్నీ జీన్స్ ని వేసవిలో ఎక్కువగా ధరిస్తే మాత్రం అసలు తప్పవు అంటున్నారు నిపుణులు. మరి వేసవిలో ఈ స్కిన్నీ జీన్స్ ధరించడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నిన్నీ జీన్స్ చాలా బిగుతుగా ఉండే డెనిమ్ తో తయారు చేస్తారు. ఇవి వేడిని పుట్టిస్తాయి.

చర్మం నుండి వచ్చే చెమటను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. వేడి వల్ల చెమట మరింత పెరుగుతుంది. కొంత సమయానికి అసౌకర్యంగా, చికాకుగా అనిపిస్తుంది. ఇది చెమట పొక్కులకు దారి తీస్తుంది. అక్కడ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. స్కిన్నీ జీన్స్ చాలా బిగుతుగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ కు ఇబ్బంది కలిగిస్తాయి. వీటిని ఎక్కువ సేపు వేసుకోవడంవల్ల కాళ్లు, పాదాల్లో తిమ్మిరి, జలదరింపు, నొప్పి వంటివి వస్తాయి. నరాలు దెబ్బతినడానికి కారణం అవుతాయి. ఇది ఇతర శారీరక సమస్యలను తెచ్చిపెడతాయి.అలాగే ఈ స్కిన్నీ జీన్స్ వల్ల వచ్చే వేడి, తేమ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు. దీని వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి.

ప్రైవేట్ పార్ట్స్ భాగంలో దురద, మంట, వైట్ డిశ్చార్జ్ వంటివి వస్తాయి. స్కిన్నీ జీన్స్ వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావొచ్చు. టైట్ ఫిట్ వల్ల చెమట వస్తుంది. ఇది పొడిగా మారేందుకు అవకాశం ఉండదు. అలా బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి. చర్మం ఎరుపుగా మారడం, వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్కిన్నీ జిన్స్ స్లీక్ అండ్ స్టైలిష్ గా ఉన్నప్పటికీ, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. వేసవి కాలంలో స్కిన్నీ జీన్స్ ను వీలైనంత వరకు వేసుకోకపోవడమే మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -