Teja Sajja: హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జా పారితోషికం ఎంతో తెలుసా?

Teja Sajja: టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. భారీ అంచనాల నడుమ సంక్రాంతి పండుగ కానుకగా నేడు విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా ప్రదర్శితం అవుతోంది. కాగా నిన్న అనగా జనవరి 11న హనుమాన్ సినిమా ప్రీమియర్స్ పడగా, ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. దాంతో హనుమాన్ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

సంక్రాంతికి భారీ పోటీ ఉన్నా కూడా హనుమాన్ సినిమాకు మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే గుంటూరు కారం సినిమాతో పోల్చుకుంటే హనుమాన్ సినిమాకే టాక్ ఎక్కువగా నడుస్తోంది. అయితే చిన్న సినిమా కారణంగా పెద్దగా థియేటర్స్ దక్కకపోయినా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే హనుమాన్ సినిమాను తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు. కానీ హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ తో చాలా గ్రాండ్ గా ఈ సినిమా అనిపిస్తుందని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో భాగంగానే హీరో తేజా సజ్జా రెమ్యూనరేషన్ కు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. హనుమాన్ సినిమాకు తేజ సజ్జ ఏకంగా 2 కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక హనుమాన్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. కలెక్షన్లు ఊహించిన దానికి అంతే ఎక్కువగా వస్తే తేజా మరింత ఎక్కువ పారితోషికం అందుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -