Pawan Kalyan: ఆ పవన్ కళ్యాణ్ సినిమాతో కొడాలి నాని భారీగా లాభపడ్డాడని తెలుసా?

Pawan Kalyan: సినిమాల్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో ఎవరంటే అందరూ చెప్పే పేరు పవన్ కళ్యాణ్. అభిమానులు ఎంతో ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకునే పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల అవుతున్నాయంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. అలాంటి పవన్ ఓ పక్కన సినిమాలు చేస్తూనే.. జనసేన పేరుతో ఓ పార్టీని స్థాపించి రాజకీయాలు కూడా చేస్తుండటం తెలిసిందే.

జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ మీద ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తుండటం మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఏపీ మంత్రి కొడాలి నాని అయితే ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ ను పావలా కళ్యాణ్ అని, ప్యాకేజ్ కళ్యాణ్, ప్యాకేజీ స్టార్ అని కామెంట్లు చేస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన కొడాలి నాని గతంలో ఎగ్జిబ్యూటర్ గా, నిర్మాతగా పని చేశాడు. దీంతో సినిమాలకు సంబంధించిన చాలా అంశాల మీద కొడాలి నానికి పరిచయం ఉంది. అయితే గతంలో కొడాలి నాని పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఓ సినిమాను కొన్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా ఎగ్జిబ్యూటర్ గా ఉన్న కొడాలి నాని.. పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘జల్సా’ సినిమాను కొన్నారట.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్, పవన్ కాంబోకు జనాలు ఫిదా అయిపోవడంతో.. భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాను కృష్ణా జిల్లాలో సొంతం చేసుకున్న కొడాలి నాని కూడా భారీగా లాభపడ్డారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద కారాలు మిరియాలు నూరే కొడాలి నాని గతంలో పవన్ సినిమా వల్ల లాభపడిన విషయం బయటకు రావడంతో.. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ అభిమానులు మాత్రం తమ హీరోను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -