Mrunal Thakur: సినిమాలలోకి రావడానికి సీతమ్మ ఇంతలా కష్టపడిందా?

Mrunal Thakur: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే నటీమణులు కొందరు చదువుపై ఆసక్తి లేక ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఉంటారు అలాగే మరికొందరు ఉన్నత చదువులు చదివి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చుంటారు. అయితే కొంతమంది నటీనటులు మీరు యాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యే వారు అని ప్రశ్నిస్తే డాక్టర్ కావాలనుకున్న కానీ యాక్టర్ అయ్యానంటూ సమాధానం చెప్పడం మనం వినే ఉన్నాం. ఇకపోతే నిజజీవితంలో డాక్టర్ కోర్స్ చదివిన వాళ్లు వైద్య వృత్తిని పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి మృణాల్ ఠాగూర్.ఇలా మొదటి సినిమాలతోనే సీతామహాలక్ష్మి పాత్ర ద్వారా అందరిని మెప్పించిన ఈమె ఈ సినిమాతో మంచి విజయం అందుకుంది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పలు ఇంటర్వ్యూలలో హాజరైన ఈమె తను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు తన క్వాలిఫికేషన్ ఏంటనే విషయాల గురించి తెలిపారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను డెంటల్ కోర్స్ పూర్తి చేశానని వెల్లడించారు. ఈ విధంగా డాక్టర్ కోర్స్ చేసిన తను తనకు ఎంతో ఇష్టమైన సినిమా రంగంలోకి వచ్చానని తెలిపారు.అయితే తాను సినిమా ఇండస్ట్రీలోకి సులభంగా ఏమి రాలేదని తాను ఇండస్ట్రీలో యాక్టర్ గా రావడానికి తన తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడలేదని తెలిపారు.ఇక తన తల్లిదండ్రులకు తాను ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోవడంతో తాను నిరుత్సాహానికి గురయ్యానని తెలిపారు.

ఇకపోతే తన తల్లిదండ్రులను కూర్చోపెట్టి త్రీ ఇడియట్స్ సినిమా పలుసార్లు చూపించానని, అందులో తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం కాకుండా పిల్లలకు నచ్చిన రంగంలో ప్రోత్సహించడం చూసిన తన తల్లిదండ్రులు తనని కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడానికి అంగీకరించారని అలా తను డాక్టర్ కోర్స్ చేసినప్పటికీ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ వెల్లడించారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -