Bhagavanth Kesari: ముసలోడి కథ అని భగవంత్ కేసరి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Bhagavanth Kesari: సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లు ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాని కథను మరొక హీరో, హీరోయిన్స్ ని చేయడం అన్నది సహజం. ఇలా ఇప్పటికే ఎంతోమంది ఎన్నో సినిమాలలో నటించి సూపర్ హిట్ లు,బ్లాక్ బాస్టర్ హిట్లర్ లతో పాటు ఫ్లాపులు కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఒక హీరోని రిజెక్ట్ చేసిన సినిమాని మరొక హీరో చేయడం ఆ సినిమా సక్సెస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అలా బాలకృష్ణ తాజాగా నటించిన భగవంత్ కేసరి సినిమాను కూడా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేశారట.

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్న వివరాల్లోకి వెళితే.. నందమూరి నటసింహం బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసిన నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా దసరా దసరా పండుగకు కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. కాగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రస్తుతం టైమ్ బాలేక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో ఫెడవుట్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు.

 

అలాంటి హీరో దగ్గరకి వెళ్లి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‎గా పేరుపొందిన అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా స్టోరీ చెప్పారట. కథ చాలా ఓల్డ్ గా ఉందని మాస్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ హీరోకి నచ్చలేదని చెప్పాడట. అంతేకాకుండా ఈ సినిమాని ముసలోడి స్టోరీ అంటూ రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ హీరో అన్న మాటకు అనిల్ రావిపూడి హర్ట్ అయ్యారట. ఎంతో నమ్మకంతో యాక్సెప్ట్ చేస్తారని ఆ హీరో ఇంటికి వెళ్తే ఇలాంటి కామెంట్స్ చేయడంతో తెగ బాధపడ్డారట. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకుని బాధపడ్డారట. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ ఈ స్టోరీని బాలయ్యకు బాగా సూట్ అవుతుందని సలహా ఇచ్చారట. దాంతో బాలయ్యకు ఆ స్టోరీ వివరించారట అనిల్ రావిపూడి. కథ వినగానే బాగా నచ్చి స్పాట్లోనే అగ్రిమెంట్ పేపర్లపై సంతకం కూడా చేశారట బాలయ్య. అలా ఈ సినిమా పట్టాలెక్కింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -