Adipurush: ఆదిపురుష్ దర్శకుని గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Adipurush : ఆదిపురుష్ డైరెక్టర్ పేరు ఓం రౌత్. ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మారుమోగుతోంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత గా చేస్తున్న మూవీని డైరెక్ట్ చేయటంతో ఈయకు ఈ క్రేజ్ వచ్చింది. సినిమా విడుదలకు ముందే ఈ పేరుకు, ఆయకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. అయితే అసలు ఈ ఓం రౌత్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా టేక్ ఓవర్ చేశారనే దానిపై బాగానే నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు.

నిర్మాత ఓం రౌత్ ఆర్థిక రాజధాని ముంబైలో పుట్టాడు. అతని తల్లి నీనా టెలివిజన్ నిర్మాత. తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్. అలాగే రచయిత, రాజ్యసభ సభ్యుడు. ఓం రౌత్ తాతగారు జె ఎస్ బండేకర్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేస్తుంటారు. దర్శకుడు కాక ముందు ఓం రౌత్ చైల్డ్ ఆర్టిస్టు గా పని చేసాడు. అలాగే కాలేజీ లో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు.

కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా ‘కారమతి కోట్’ అనే సినిమా చేసాడు. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేసాడు. చదువు పూర్తి చేసాక ఓం రౌత్ న్యూ యార్క్ లో ఎంటీవీలో కొన్నాళ్లు పనిచేశాడు. మొదటి సినిమా ఓం రౌత్ మరాఠీ భాషలో ‘లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్’. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, దీనికి బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది.

ఆ తరువాత 2020 సంవత్సరంలో వచ్చిన ‘తానాజీ’ అనే సినిమాతో దర్శకుడిగా హిందీలోకి ఆరంగేట్రం చేసాడు. ఇది కూడా ఒక పీరియడ్ సినిమా. అజయ్ దేవగన్, అతని భార్య కాజోల్ ఇందులో లీడ్ పెయిర్ గా నటించారు. టీ- సిరీస్ సంస్థ నిర్మాణం చేసింది. అక్కడే వీరితో ఓం రౌత్ కు బాగా పరిచయం ఏర్పడి, ఆదిపురుష్ చేయటానికి కారణమైంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -