Drinking Water: తినేటప్పుడు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Drinking Water: భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ నీరు తాగడం మామూలే. కానీ.. అలా తింటున్నప్పుడు నీరు తాగడం మంచిదేనా అని చాలా మందికి అనుమానాలు వస్తుంటాయి. సాధారణంగా అత్యవసరమైనప్పుడు అన్నం ముద్ద గొంతులో దిగనప్పుడు నీరు తాగుతాం. అయితే.. సాధారణంగా తినేటప్పుడు నీరు తాగరాదని తిన్న తర్వాతే తాగాలని చాలా మంది అంటుంటారు. కానీ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఆహారం తినే సమయంలో గానీ, తిన్న తర్వాత వెంటనే గానీ నీరు తాగడం మంచిది కాదనుకుంటారు. ఆహారం తింటూ నీరు తాగితే అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కొంత మంది ఆయుర్వేద నిపుణులు కూడా భోజనం చేయడానికి ముందు, చేసిన తాగడానికి కనీసం అరగంట సమయం ఇవ్వాలని సూచిస్తారు.

భోజనం చేస్తున్నప్పుడు కూడా నీరు తాగవచ్చు. వాస్తవానికి నీరు ఎప్పుడు తాగినా మంచిదేనని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి ముందు గానీ, భోజనం చేసేటపుడు గానీ, భోజనం తర్వాత గానీ నీరు తాగితే జీర్ణ ఎంజైమ్లు పలుచన చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ నెమ్మదవుతుంది అనే అభిప్రాయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు నిపుణులు. భోజన సమయంలో నీరు తాగడాన్ని నివారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

మనం ఆహారంలోనే చాలా నీరు ఉంటుంది. భారతీయులు సూప్లు, రసాలు వంటి పలుచని ఆహారం తింటారు వాటిలో నీరు ఉంటుంది. అలాగే సలాడ్లు తింటారు అందులోనూ నీరు ఉంటుంది. కూరగాయల్లో నీరు ఉంటుంది, పెరుగు, మజ్జిగల్లోనూ నీరే ఉంటుంది. అంతేకాదు మనం ఆహారాన్ని నమలడం ద్వారా ఉత్పత్తి అయ్యే లాలాజలంలోనూ నీరే ఉంటుంది. మనం తినే సాంప్రదాయ ఆహారంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, అది ఏ విధంగానూ జీర్ణక్రియను ప్రభావితం చేయదు. కాబట్టి నీరు తాగకూడదు అనే దానిలో అర్థం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -