Sleeping: ఆ వైపు తలపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Sleeping: భారతదేశంలో హిందువులు ఎన్నో రకాల ఆచారాలను సంప్రదాయాలను వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో వాస్తు విషయాలను నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇల్లు ఆఫీసు వ్యాపార స్థలాలలో ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క చోట వాస్తు విషయాలను పాటిస్తున్నారు. కేవలం ఇల్లు కార్యాలయాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా అనేక విషయాలలో వాస్తు విషయాలను పాటిస్తున్నారు.

కాగా వాస్తు నియమాలు పాటించకపోతే మనిషి మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా ప్రభావం పడుతుంది. అందుకే వాస్తు విషయాలను తప్పకుండా పాటించాలని చెబుతూ ఉంటారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. మనం పడుకునే సమయంలో కొన్ని రకాల దిక్కులలో మాత్రమే మనం పడుకుంటూ ఉంటాం. మరి వాస్తు శాస్త్ర ప్రకారంగా ఏ దిక్కున పాడుకోవాలి.. ఏ దిక్కున పడుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణం వైపు తలపెట్టి నిద్రించడం చాలా మంచిది దక్షిణ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల మానసిక సమస్యలు దూరం అవుతాయి. ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగు పడుతుందని. దక్షిణం వైపు కాళ్ళు అస్సలు పెట్టకూడదు. అలా వైపు కాళ్ళు పెట్టి పడుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే తూర్పు వైపు నిద్రించడం మంచిది. మాములుగా అయితే దక్షిణం తర్వాత తూర్పు వైపుకు వెళ్లడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించడమే కాకుండా ఇతర దేవతల ఆశీస్సులు కూడా పొందుతారు.

 

అలాగే ఇంట్లో ఒంటిరిగా సంపాదించే వారు తూర్పు వైపు తలపెట్టి పడుకుంటే ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా అధిగమించవచ్చు. తూర్పు వైపు విద్యార్థులు తలపెట్టి నిద్రిస్తే చదువు పట్ల మొగ్గు చూపడంతో పాటు ఏకాగ్రత కూడా పెనుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -