Jagan-Chandrababu: జగన్, చంద్రబాబులలో నంబర్ వన్ సీఎం ఎవరో తెలుసా?

Jagan-Chandrababu: పేద, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి కచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు కావాలి. అదే సమయంలో ఆ ప్రాంత అభివృద్ధి కూడా ముఖ్యమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు అంశాల మధ్యనే చర్చ జరుగుతోంది. ఈ 2024 ఎన్నికలు సైతం దీని మీదనే సాగనున్నాయి.

 

విభజిత ఆంధ్రప్రదేశ్ కు మెుదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. అమరావతిని రాజధానిగా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు. మరోవైపు విశాఖ నుంచి అనంతపూర్ వరకు పలు పరిశ్రమలు స్థాపించారు. ప్రస్తుతం అవి రన్నింగ్ లో ఉన్నాయి. పరిశ్రమలు, కంపెనీలు రావటం మూలంగా ఉపాధి అవకాశాలు మెుండుగా అవుతాయని నిరుద్యోగులు అంటున్నారు. ఇక సంక్షేమానికి వస్తే జగన్ వైపు వేలు చూపుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ… సంక్షేమం వైపు దృష్టి పెట్టింది. అప్పులు తెచ్చి మరీ, పేదలకు పంచి పెడుతోంది. దీనివల్ల కొన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. నవరత్నాల స్కీంల పేరుతో బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతి వైపు నడుపుతామని ఆ పార్టీ అధినేత జగన్ చెబుతున్నారు.

 

ఇలా రెండు రకాల ఆలోచనలు కలిగిన జగన్,చంద్రబాబు ప్రజలు ఓటేస్తున్నారు. కొందరు జగన్ ని ఎంచుకుంటే, మరికొందరు చంద్రబాబును ఎంచుకుంటున్నారు. రాష్ట్రానికి ఇద్దరు అవసరమేనని అభిప్రాయలు బలంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి విషయంలో చంద్రబాబు నంబర్ వన్ అయితే సంక్షేమం విషయంలో జగన్ నంబర్ వన్ అని కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -