Health Benefits: రోజూ శృంగారంలో పాల్గొంటే లాభమా.. నష్టమా.. డాక్టర్ ఏమన్నారంటే?

Health Benefits: పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంటారు అయితే కాస్త వయసు పైబడిన తర్వాత శృంగారంలో పాల్గొనడానికి ఏమాత్రం ఇష్టం చూపరు అయితే కొందరు రోజు శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి చూపిన మహిళలు మాత్రం కొన్నిసార్లు శృంగారంలో పాల్గొనడానికి ఏ విధమైనటువంటి ఆసక్తి చూపరు అంతేకాకుండా ప్రతిరోజు శృంగారంలో పాల్గొనకూడదని కొందరు భావిస్తూ ఉంటారు మరి నిజంగానే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం మంచిదేనా అలా పాల్గొనవచ్చా? పాల్గొంటే ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయి అనే విషయానికి వస్తే….

శృంగారంలో పాల్గొనాలి అంటే మగవారిలో టెస్టోస్టిరాన్,ఆడవారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ఉత్పత్తి కావాలి ఇలా ఈ హార్మోన్ల ఉత్పత్తి అధిక స్థాయిలో ఉన్నప్పుడు వారిలో శృంగార కోరికలు అధికంగా ఉంటాయి.ఇలా ఎవరిలో అయితే హార్మోన్ల ఉత్పత్తి అధికంగా ఉంటుందో వారు ప్రతి రోజు శృంగారంలో పాల్గొంటారు. అయితే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల ఏ విధమైనటువంటి నష్టాలు లేవు. ప్రతిరోజు శృంగారంలో పాల్గొనకూడదు అనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

ఇలా ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా యాక్టివ్ గా మానసిక ఆనందంతో ఉంటారు.ఏ విధమైనటువంటి ఒత్తిడి టెన్షన్స్ లేకుండా చాలా యాక్టివ్ గా మరుసటి రోజు వారి పనులను వారు ప్రారంభిస్తారు.అందుకే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల ఏ విధమైనటువంటి నష్టం లేదని లాభాలు మాత్రమే ఉన్నాయని మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే నెలసరి సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.నెలసరి సమయంలో కూడా భార్య భర్తలకు అభ్యంతరం లేకపోతే శృంగారంలో పాల్గొనవచ్చు. అయితే ఈ సమయంలో మహిళలు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు ఎందుకంటే నెలసరి సమయంలో మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే నెలసరి సమయంలో మహిళలు రక్తస్రావం కారణంగా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. కనుక ఈ సమయంలో వారు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -