Baby: ఇలాంటి బూతు డైలాగ్స్ అవసరమా బేబి.. అదే మైనస్ అంటూ?

Baby: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు నటించిన సినిమా బేబీ ఎలా ఉందో వాటి ప్లస్లు, మైనస్లు ఏంటో చూద్దాం. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బేబీ. సాయి రాజేష్ నీలం డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ సినిమా కదేంటో ముందు చూద్దాం. ఆనంద్, వైష్ణవి స్కూల్ నుంచే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమ కూడా వయసుతో పాటు పెద్దదవుతుంది.

వైష్ణవి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే ఆనంద్ ఆటో డ్రైవర్ గా మారుతాడు. కాలేజీకి వెళ్లిన వైష్ణవికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాటి వల్ల ఆమె జీవితంలో అనుకొని మార్పులు వస్తాయి. అక్కడ వీరాజ్ అనే వ్యక్తి వైష్ణవి జీవితంలోకి వస్తాడు. అప్పటికే ఆనంద్ తో ప్రేమలో ఉంటుంది అయినా అనుకోని పరిస్థితులలో దగ్గరవుతుంది. అప్పుడు వైష్ణవి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది వారి జీవితాలు ఎలా ముందుకు వెళ్లాయి అనేది సినిమా కథ. సినిమా మొత్తం హీరోయిన్ వైష్ణవి మీదే తిరుగుతుంది. విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ వారి పరిధి మేరకు బాగానే నటించారు.

 

వైష్ణవిది మొదటి సినిమా అయినా కూడా నటనలో చించేసింది. అయితే ముందు నుంచి ఈ సినిమాని కల్ట్ మూవీ అని చెప్పుకుంటూ వస్తున్నారు మూవీ మేకర్స్. కానీ ఇది కల్ట్ సినిమా అనటం కన్నా లస్ట్ సినిమా అనటం బెటర్ ఎందుకంటే ఆ రేంజ్ లో బూతు డైలాగులు వాడాడు డైరెక్టర్.

 

సెన్సార్లు మ్యూట్ అవుతాయని తెలిసి కూడా కొన్ని పదాల్ని అదేపనిగా వాడారు. నువ్వు తెరవాల్సింది కళ్ళు కాదు కాళ్లు అన్న డైలాగు అవసరమా అంటూ నోరెళ్లబెట్టారు ప్రేక్షకులు. అదే ఈ సినిమాకి మైనస్ అని కూడా అంటున్నారు. చాలా చోట్ల ఆర్ఎక్స్ 100 ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమా నిడివి కూడా మూడు గంటల పాటు ఉండడం అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -