Baby Movie: బేబీ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Baby Movie: సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబీ. ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా మొదటి రోజుతో పోలిస్తే మిగిలిన రెండు రోజులు అత్యధిక కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది . ఇలా ఈ సినిమా కలెక్షన్లను కనుక చూస్తే చరిత్ర సృష్టిస్తుందేమోనన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టగా మూడో రోజుకు వచ్చేసరికి ఏకంగా 23 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనమైన విజయాలను అందుకుంది. ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఇప్పటికే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ రాఘవేంద్రరావు వంటి సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ ఏడాది విడుదలైనటువంటి చిన్న సినిమాలలో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని చెప్పాలి.మరి మూడో రోజులో భాగంగా ఈ సినిమా ఏ ఏ ప్రాంతాలలో ఎంత మొత్తంలో కలెక్షన్లు రాబట్టిందనే విషయానికి వస్తే…

 

నైజాం రూ. 8,56,50,706, వైజాగ్ రూ 2,82,56,239
ఈస్ట్ రూ.1,38,06,945, వెస్ట్ రూ. 83,00,334
కృష్ణ రూ. 1,33,22,572, గుంటూరు రూ.1,08,04,046
నెల్లూరు రూ. 69,56,210, సీడెడ్ రూ. 2,09,11,880
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా రూ. 77,93,808
ఓవర్సీస్ రూ.3,94,00,000 ఇలా మొత్తం ఓవరాల్ గా ఈ సినిమా 23,52,02,740 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -