Sleeping: తూర్పువైపు తలపెట్టి నిద్రిస్తున్నారా.. ఫలితాలు ఇవే?

Sleeping: ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఇంట బయట ఆఫీసులలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక విషయంలోను వాస్తు విషయాలను పాటిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇంట్లోనే దిశల విషయంలో కూడా చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మనకు నాలుగు దిక్కులు ఉన్నాయన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఆయా దిక్కులలో ఆయా పనులు చేయాలని మన పెద్దలు చెబుతుంటారు.

అంతే కాకుండా పూర్వకాలం నుంచి కొన్ని దిక్కులలో కొన్నిపనులు చేస్తే మంచి జరుగుతుందని వాటిని ఆచరిస్తున్నాము. అలాంటి వాటిలో నిద్రపోయేటప్పుడు ఎటువైపు తల ఉంచి నిద్రించాలనేది కూడా ముఖ్యమే. తల ఏ దిశగా పెట్టి పాడుకోవాలి అన్న విషయాన్ని కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి తూర్పు వైపున తలపెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆయా గదుల్లో రాత్రి నిద్రించే సమయంలో ఏ వైపునకు తలపెట్టి నిద్రించాలో శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్ధేశిత దిశల్లో నిద్రించడం ద్వారా సుఖప్రదమైన నిద్ర లభిస్తుంది.

 

అలాగే జీవితంలో కొన్ని అధ్బుత సంఘటనలు సైతం జరిగే అవకాశమున్నట్టు వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. తూర్పు దిశగా తలపెట్టి నిద్రిస్తే అటువంటి వారిలో జ్ఞానసంపద వికసిస్తుంది. అలాగే వీరిలో ఆధ్యాత్మిక చింతన సైతం పెరుగుతుంది. తూర్పు దిశగా తలపెట్టి నిద్రించడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగుతుంది. ఆ దిశగా తలపెట్టి నిద్రించే వారికి ఆరోగ్య సమస్యలు సైతం దరిచేరవు. తద్వారా వీరు మంచి ఆరోగ్యంతో కులాసాగా ఉంటారని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. తూర్పువైపు నుంచి వచ్చే గాలిలో ఉండే ఆయా వాయువుల ప్రభావం వల్ల మంచి జరుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -