Ramudu: రాముడికి మీసాలు ఉంటాయా.. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే?

Ramudu: జూన్ 16న ఆది పురుష్ సినిమాతో యూనివర్సల్ హీరో ప్రభాస్ మన ముందుకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి ఎంత రేంజ్ లో హిట్ కొట్టి సత్తా చూపాలని ఎదురుచూస్తున్నారు మూవీ మేకర్స్. మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్ తో ఆ అంచనాలు మరింత భారీగా పెరిగాయి. అయితే ఇందులో ప్రభాస్ మీసాలతో ఉండటం పెద్ద చర్చకు దారితీసింది.

 

నటి కస్తూరి.. మీసాలతో ఉన్న ప్రభాస్ ని చూస్తే రాముడిలాగా కాదు కర్ణుడి లాగా కనిపించాడు అంటూ కామెంట్ చేసింది. ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే రాముడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఎవరూ చూడలేదు ముందు తరాలు చిత్రకారులు గీసిన బొమ్మల ఆధారంగా రాముడుని ఊహించుకున్నాము అంటున్నారు డార్లింగ్ ఫాన్స్.

ఇదే విషయాన్ని ఒక వీడియో ద్వారా కూడా షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే. అందులో డాక్టర్ అనంతలక్ష్మి అనే మహిళ అసలు విషయాన్నీ చెప్పింది. రాజా రవివర్మ వేసిన చిత్రాల ఆధారంగా దేవుళ్ళ ఫోటోలు చలామణిలోకి వచ్చాయి. రాజా రవివర్మ ది కేరళ అక్కడ మగాళ్లకు గడ్డాలు మీసాలు ఉండవు.

 

అందుకే ఆయన గీసిన ఏ ఫోటోలో దేవుళ్ళకి గడ్డాలు మీసాలు ఉండవు అంత మాత్రం చేత పురాణపురుషులకి గడ్డాలు మీసాలు ఉండవని అర్థం కాదు అందుకు ఉదాహరణగా ఒక సందర్భాన్ని తెరమీదకి తీసుకువచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్. అదేంటంటే వనవాసం ముగిసిన తరువాత అయోధ్యకి తిరిగి వస్తున్నా రాముడికి సాంప్రదాయ బద్ధంగా గడ్డం మీసము తీయించి తీసుకువెళ్లారట.

 

అంటే దీని అర్థం రాముడు మీసాలతో ఉన్నట్లే కదా అని లా పాయింట్ తీస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ విషయాన్ని పక్కన పెడితే యూ వి క్రియేషన్స్ నిర్మాత విక్రం మాట్లాడుతూ ముందు సినిమాను చూడండి అప్పుడు రాముడికి మీసాలు ఎందుకు ఉన్నాయో అర్థం అవుతుంది అని చెప్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -