Chiranjeevi: చిరంజీవి సినిమాలు చేయొద్దనే వాళ్లకు ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Chiranjeevi: టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ వస్తే ముందుగా చిరంజీవి పేరు ప్రస్తావించిన తర్వాత ఆ చర్చ ముందుకు సాగుతుంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఎవరైనా అనేది అందరికీ తెలుసు. అయితే ఆ మధ్యన సినిమాలకు దూరంగా ఉండటంతో పాటు రీఎంట్రీలో భారీ హిట్ అందుకోలేకపోవడంతో.. చిరంజీవి పని అయిపోయిందని కొంతమంది కావాలని కామెంట్ చేశారు.

 

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో కానీ ఇప్పుడు మాత్రం ఏమీలేదు. కాబట్టి అలాంటప్పుడు సినిమాలు చేయడం అవసరమా? సినిమాలు మానెయ్యొచ్చు కదా? అని కొంతమంది కామెంట్ చేశారు. అయితే అలా కామెంట్ చేసి చిరంజీవి మీద తమ అక్కసును వెల్లగక్కుతున్న వారికి మెగా ఫ్యాన్స్ దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చారు.

 

అసలు చిరంజీవి సినిమాలు చేయాలో, మానెయ్యాలో చెప్పడానికి మీరెవ్వరు అనేది ముందుగా వచ్చిన కామెంట్. అది నిజమే ఎందుకంటే చిరంజీవికి ఆసక్తి ఉన్నంత కాలం, నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నంత కాలం ఆయన సినిమాలు చేయడానికి ఎవరూ అడ్డు చెప్పడానికి లేదు. ఒకవేళ నిజంగా చిరంజీవి సినిమాలను ప్రేక్షకులు ఆదరించకపోతే అప్పుడు నిర్మాతలు కూడా సినిమాలు చేయడానికి ముందుకు రారు కదా.

 

కానీ చిరంజీవి లేటు వయసులో కూడా స్క్రీన్ మీద కనిపించిన విధానం, స్టెప్స్ వేసిన విధానం ఒక్క మెగా అభిమానులనే కాదు, సగటు తెలుగు ప్రేక్షకుడిని కూడా ఎంతో ఆకట్టుకుంది. మరి ఇలాంటప్పుడు చిరంజీవిని సినిమాలు ఆపెయ్యాలని చెప్పడానికి కొంతైనా సిగ్గుండాలని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి చూపించిన గ్రేస్ తో మరో 20 ఏళ్ల వరకు చిరంజీవికి ఇండస్ట్రీలో ఢోకా లేదనే విషయం అర్థమవుతోందని మెగా అభిమానులు నొక్కిచెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -