CM KCR: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. ముందస్తు ఎన్నికలు ఖాయమా?

CM KCR: సీఎం కేసీఆర్ ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు గత కొద్దికాలంగా జరుగుతున్న ప్రచారమే. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలతో పాటు అధికారి టీఆర్ఎస్ నేతలు కూడా ముందస్తు ఎన్నికలకు వస్తాయనే కామెంట్స్ చేయడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది. మంత్రి కేటీఆర్ కూడా ముందస్తు ఎన్నికలకు తాము సిద్దమంటూ కామెంట్స్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలపై మీడియా వేదికగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకు సిద్దమా.. మీకు ఒకే అయితే ఎన్నికలకు వెళదాం అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ కు ప్రతిపక్షాలు కూడా గట్టి సమాధానం ఇచ్చాయి. ముందస్తు ఎన్నికలకు సై అంటూ సవాల్ ను స్వీకరించాయి. దీంతో ముందస్తు ఎన్నికలపై మరోసారి చర్చ జరుగుతోంది.

అయితే తాజాగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకోవడంతో పాటు త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటుకకు అడుగులు వేస్తున్నారు. శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా కమిటీలన్నీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తీర్మానం చేశాయి. టీఆర్ఎస్ భవన్ లో జిల్లా అధ్యక్షులందరూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి బంగారు భారత్ దిశగా కృషి చేయాలని తీర్మానం చేయించినట్లు తెలిపారు.

దీంతో కేసీఆర్ త్వరలో కొత్త పార్టీని ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు కొత్త జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. వచ్చే నెలలో సంక్రాంతి రోజున కొత్త పార్టీని ప్రకటించే అవకాశముంది. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటం, కేసీఆర్ ముహూర్తాలను, జాతకాలను బాగా నమ్ముతారు కనుక ఆ రోజు కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్నారని సమాచారం. రైతుల సమక్షంలో ఈ పార్టీని ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు వెళ్లి సీఎంలను కలిసిన కేసీఆర్.. బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుపోయే అకకాశముంది.

అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే ముందుగా తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావాల్సి ఉంటుంది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళితే 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఫ్రీ అయి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టవచ్చు. 2024 లోక్ సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీకి సరైన అభ్యర్థులు లేరు.. ఇప్పుడిప్పుడే బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇక కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమవతమవుతుంది. ఇలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళితే తనకు కలిసొస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట.

మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే కేసీఆర్ కు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకావముంది. రాష్ట్రంలో బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకే హుజూరాబాద్ లో లాగా మునుగోడు నియోజకవర్గంపై కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. మునుగోడు ఉపఎన్నిక అవసరమా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే మునుగోడు ఉపఎన్నిక కంటే ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -