అలా చేస్తే షుగర్‌ కంట్రోల్‌ అవుతుందా?

నేటి కాలంలో రోజుకొక కొత్త కొత్త వ్యాధులు పుట్టుకోస్తున్నాయి. మధుమేహ వ్యాధి సాధారణంగా మారిపోయింది. ప్రతి ఇంట్లో ఒక్కరైన ఆ వ్యాధి ఉన్న ఉంటున్నారు. అలాంటి వారు ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. షుగర్‌ ఉన్నవాళ్లు షుగర్‌ను కంట్రోల్‌ చేయాలంటే వారు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి.మధుమేహం ప్రసవం తర్వాత మాత్రమే పోతుంది. అయితే.. చాలా సాధారణమైన మధుమేహాన్ని తీసుకునే ఆహారం, మందుల ద్వారా కంట్రోల్‌ చేయకపోతే దాన్ని వారు పూర్తిగా తగ్గించుకోలేరు. కొన్ని తప్పిదాల వల్ల వారి చక్కెర స్థాయిని పరిమితం చేస్తాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ వారు శ్రద్ధ వహించాల్సిందే.

ఒత్తిడి కారణంగా..

చాలా మందికి ఒత్తిడి కారణంగా మధుమేహం వస్తుంది. ఈ క్రమంలో ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెంచేందుకు దారితీస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.

అల్పాహారం మిస్‌ చేయడంతో..

ఎంతో మంది తమ తమ పనుల్లో పడి కొన్నిసార్లు ఉదయం అల్పాహారం తీసుకోవడం మర్చిపోతారు. అయితే మ«ధుమేహం ఉన్నవారికి మాత్రం ఇది అత్యంత ప్రమాదకరంమే. ఎట్టి పరిస్థితుల్లో మధుమేహం ఉన్నవాళ్లు అల్పాహారం మిస్‌ చేయకూడదు. ప్రతిరోజూ పోషకాహార విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి.

ఫైబర్‌ ఉండే ఆహారాన్ని తినకపోవడం..

మానవ శరీన రోజువారి అవసరాలకు 25–35 గ్రాముల ఫైబర్‌ అవసరం. ఎందుకంటే అది జీర్ణక్రియతో పాటు జీవక్రియను బలోపేతం చేసేందుకు సహకరిస్తోంది. అంతేకక చక్కెర శోషణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అందుకే ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు çసూచిస్తున్నారు.

వ్యాయామం విస్మరించడం..

నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతోంది. వ్యాయామం, రన్నింగ్‌ చేస్తున్నప్పుడు కండరాల కణాలకు చక్కెరను తరలించడం ద్వారా ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచడానికి ఇది దోహదపడుతోంది. వ్యాయామం చేస్తే కండరాలు కుదించబడి కణాలు గ్లూకోజ్‌ని స్వీకరించడానికి సహకరిస్తుంది. దీంతో పాటు బరువు కూడా నియంత్రించబడుతుంది. దీంతో పాటు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను నిర్వహిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -