AP Liquor Policy : ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు.. జగన్ రెడ్డికి భారీ షాక్ తప్పదంటూ?

AP Liquor Policy : మద్యం విక్రయాల్లో వేలకోట్ల రూపాయిలు అవినీతి జరుగుతుందని దీనిపై సిబిఐతో విచారణ చేయించాలని కేంద్ర హోం మంత్రిని కోరిన పురందరేశ్వరి. మద్యం వ్యాపారంలో భారీగా అవినీతి జరుగుతుందని ఇక్కడ విక్రయిస్తున్న నాసిరకం మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోలుకోవటమే కాకుండా వేలకోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. మద్యం దుకాణాలను గతంలో టెండర్ ద్వారా అప్పగించే వారు.

అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తోందని వివరించారు పురందరేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కాం ద్వారా, ఇసుక ద్వారా సేకరిస్తున్న నగదు అక్రమ చెలామణి కోసం షెల్ కంపెనీలు పెట్టారన్నారు. వీటిపై కూడా విచారణ జరిపి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీ మద్యం దుకాణాల్లో ప్రముఖ బ్రాండ్లు ఏవి ఉండవు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బినామీ కంపెనీల పేరుతో తయారుచేసిన నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ఉంటారు.

వాటికి ఎలాంటి సర్టిఫికెట్ ఉండదు. అందుకే ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలను నిషేధించారు. ఏపీలో మాత్రం వేల కోట్లు అమ్ముతూ ఉంటారు ఇదంతా వైసీపీ కనుసన్నులలో జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఎక్కడా ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ జరగదు. నాలుగేళ్లు తీవ్రమైన ఆరోపణల తరువాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టాము అని గవర్నమెంట్ ప్రకటించింది కానీ ఎక్కడా వాటిని వాడటం లేదు. రోజుకు లక్ష రూపాయలు అమ్మామని చెబితే అందులో వెయ్యి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండటం లేదు. వారు ఎంత అమ్మామని చెప్తే అదే లెక్క. ఇదే విషయం గా నాలుగేళ్లుగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారం అంతా వైసీపీ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. దశలవారీగా మద్య నిషేధం పేరుతో ప్రభుత్వం పేరుతో వైసీపీ స్వాధీనం చేసుకున్న షాపులకి వెళ్లే లాగా చేశారు. అక్కడి నుంచే భారీ స్కాం జరుగుతుందంటూ ఆరోపణలు జరిగాయి. వీటన్నిటికి ఒకదానికి ఒకటి సంబంధం లేదు కానీ తెరవనకు మాత్రం ఏదో లింకు ఉంది అన్న అభిప్రాయం బలపడుతుంది. సదరు విషయాలపై ఈడి దర్యాప్తుకు సిద్ధమైనట్టు తెలిసింది. అదే గనుక జరిగితే జగన్ రెడ్డికి భారీ షాక్ తప్పదు అంటున్నారు ప్రజలు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -